వైఎస్‌ఆర్‌ కంటివెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కర్నూలులో ప్రారంభించారు. నూతనంగా నిర్మంచనున్న ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్‌ మాట్లాడారు. మార్చి 1 నుంచి అవ్వ, తాతలకు కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు జగన్‌ తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే కళ్ల జోళ్లు అందిస్తామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా గవర్నమెంట్ ఆసుపత్రులలో వైద్యం మరియు సదుపాయాలు తీర్చిదిద్దుతామని జగన పేర్కొన్నారు.

 

ఎక్కడ అవసరం ఉంటుందో అటువంటి ప్రదేశాలలో జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త హాస్పిటల్ లు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల దగ్గరనుంచి బోధన్ ఆసుపత్రుల వరకు అన్ని బాగు చేస్తామని రూపురేఖలు మారుస్తామని తెలిపారు. అంతేకాకుండా తాజాగా మూడో విడత కార్యక్రమం లో రాష్ట్రంలో ఉన్న 60 ఏళ్లకు పైబడిన వయసువాళ్ళు వృద్ధులకు గ్రామ వార్డు లోని వైయస్సార్ కంటి వెలుగు పథకం అందించే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు జగన్ తెలిపారు. దీంతో చాలా రోజుల తర్వాత వైయస్ జగన్ కర్నూలు ప్రాంతం లోకి రావడంతో కర్నూలు ప్రాంత ప్రజలు భారీ హడావిడితో స్వాగతం పలికారు.

 

ముఖ్యంగా కర్నూల్ కి హైకోర్టు జగన్ ప్రకటించడంతో జగన్ ఫ్లెక్సీలు కర్నూల్ ప్రాంతంలో భారీ స్థాయిలో వెలిశాయి. జగన్ ప్రవేశించే ముఖద్వారంలో కర్నూలు ప్రాంతానికి చెందిన వైసీపీ కార్యకర్తలు మహేష్ బాబు 'వచ్చాడయ్యో సామి' అనే పాటతో స్వాగతం పలికారు. చాలామంది కర్నూలు ప్రాంత ప్రజలు జగన్ వెళ్తున్న కాన్వాయ్ కి థాంక్యూ సీఎం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కర్నూలు ప్రాంతానికి హైకోర్టు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజుల తర్వాత కర్నూలు ప్రాంతానికి వైయస్ జగన్ వెళ్లడంతో భారీ స్థాయిలో పార్టీ క్యాడర్ మొత్తం వైయస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమానికి హాజరైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: