వ్యవసాయం అంటేనే ఓ దండగ అనే భావన ఇప్పుడు ఏర్పడిపోయింది. దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలవని రీతిలో పరిస్థితులు ఉన్నాయి. పెట్టుబడి సాయం అందకపోవడం, గిట్టుబాట ధర, నిల్వ సౌకర్యాలు వంటి సమస్యలు ఎప్పుడూ ఉండేవే. వీటికి తోడు రైతులు పాత పద్దతుల్లోనే సాగు సాగించడమూ నష్టాలకు కారణమే.

 

అలా కాకుండా కొత్త పద్దతుల్లో సాగు చేసి లాభాలు కళ్ల చూస్తున్న రైతులు కూడా ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈ కథనం. కరీంనగర్‌ జిల్లా, సుందర గిరిలో గతంలో రైతులు ఎప్పటిలాగానే వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసేవారు. నష్టాలపాలయ్యేవారు. ఇప్పుడు వారు వినూత్న పద్దతుల్లో కూరగాయల సాగు చేస్తూ లాభాలు కళ్ల జూస్తున్నారు.

 

 

కూరగాయల సాగుకు నాబార్డు అధికారులు సహకరిస్తున్నారు. సాధారణ పద్దతుల్లో కాకుండా ఆర్గానిక్ పద్దతుల్లో పురుగు మందులు వాడకుండా.. చేస్తున్న సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. పందిళ్లు వేసుకుని.. వేప నూనె, వేప పిండితో పంటకు చీడపడ్డకుండా కొత్త పద్దతుల్లో ఇక్కడ సాగు చేస్తున్నారు.

 

 

ఈ విధానం ద్వారా ఇప్పుడు రైతులు నెలకు 30 వేల వరకూ సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారు. ఇక్కడి ఓ రైతు కుమారుడైన రాధాకృష్ణ అనుభవం ఇలా ఉంది..

‘‘ నేను కరీంనగర్‌లో టీచర్‌గా కొలువు చేసేవాడిని. ఓ రోజు నెల జీతం 15 వేలు తీసుకొని, ఇంటికి వచ్చిన.. అపుడే పొలం నుండి వచ్చి, కాయగూరల మూటలను ఆటోకి ఎక్కించి వచ్చిన డబ్బును లెక్కపెట్టరా.. ని నా చేతికిచ్చిండు మానాన్న.

 

 

మొత్తం 35 వేలు. వారం రోజుల్లో పండిన పంటకు వచ్చిన ఆదాయం అది. వెంటనే బడి మానేసి సాగుబడిలోకి వచ్చాను. రెండు ఎకరాల్లో టమాటా, కాకర, బీర పంటల మీద ఎన్నడూ చూడని ఆదాయం వస్తున్నది ’ అంటూ తన అనుభవాన్ని వివరించాడు. వ్యవసాయం సుసంపన్నం చేయడం ఎలాగో తెలుసు కోవాలంటే...ఈ వీడియో చూడండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: