జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై, ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను నిలువునా మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పంట అమ్మిన 48 గంటలలోనే సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చారని కానీ హామీని నిలబెట్టుకోలేకపోయారని పవన్ అన్నారు 
 
వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కొరకు నిధులు కేటాయించిందా...? లేదా...? అని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఒకవేళ ధాన్యం కొనుగోలు కొరకు నిధులను కేటాయించి ఉంటే ఆ నిధులు ఎటు పోయానని ప్రశ్నించారు. రైతుల పంటలను అమ్ముకొని రోజులు గడుస్తున్నాయని కానీ పంట అమ్మిన సొమ్ము మాత్రం రైతుల చేతికి అందలేదని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా, రైతు సంక్షేమం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని అన్నారు. 
 
ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల తరువాత బకాయిలు చెల్లించకుండా రైతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. దాదాపు 2016 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దాదాపు లక్ష మంది రైతులు అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 
 
రోజురోజుకు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయని పవన్ చెప్పారు. ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించకపోవడం వలన రెండో పంట విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సీఎం జగన్ రైతులకు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నుండి ధాన్యం కొనుగోలు సొమ్ముకు సంబంధించిన సమాధానం రావడం లేదని వైసీపీ బాధ్యతా రాహిత్యానికి ఇది నిదర్శనమని పవన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: