ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతి ప్రాంతాన్ని కదిలించడం ఎవరి తరం కాదని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుందని అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు.

 

అయితే మరోపక్క రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ అమరావతి ప్రాంతంపై జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర పెద్దల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత రైతులంతా కలిసి ఢిల్లీకి ప్రయాణమై వెళ్లాలని భావించిన చివరి క్షణంలో వాళ్ల టూర్ మొత్తం క్యాన్సిల్ అయిందంట.

 

ముందుగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలుసుకోవడానికి సిద్దం అయినా టిడిపి ఎమ్మెల్సీలు డిల్లీ వెళ్లలేదట.ఒక మీడియాలో వచ్చిన కదనం ప్రకారం శాసనమండలి రద్దుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిర్యాదు చేయాలని టిడిపి నిర్ణయించింది. అలాగే ఉప రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లాలని అనుకున్నారట. టిడిపి ఆ మేరకు డిల్లీకి ఎమ్మెల్సీలను పంపించాలని తలపెట్టింది.అయితే వారిని కలుసుకోవడానికి అమిత్ షా నో చెప్పారట.

 

కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపాయింట్‌మెంట్ మాత్రమే ఖరారైంది. దీంతో ఇక చేసేదేమీలేక టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారని కధనం. మరోపక్క అమిత్ షా చంద్రబాబు హయాంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ పరంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నేపథ్యంలో అమరావతి రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: