పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది . సకాలంలో కమిషన్ నివేదిక అందించలేదన్న కారణంగా పీఆర్సీ గడువు ను ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది . 2018  ఆగస్టు 15 వ తేదీ నుంచి పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ, అమలుకు నోచుకోకపోవడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . కమిషన్ నియమించి  20  నెలలు గడుస్తున్నా ఎందుకు నివేదిక అందించలేదో అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు .

 

11 పీఆర్సీ ప్రకటించడం లో ఆలస్యం అవుతున్నందున, వెంటనే ఐఆర్ (మధ్యంతర  భృతి)  ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు . పీఆర్సీ గడువు పెంపు పై టీపీసీసీ అధికార ప్రతినిధి , టి పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . నిత్యం కేసీఆర్ భజన చేసే ... భజన సంఘం నేతల్లారా నిద్రపోతున్నారా , చేవ చచ్చిందా అంటూ ప్రశ్నించారు . పీఆర్సీ గడువు పొడగించిన నిత్యం కేసీఆర్ భజన చేసే  టీఎన్జీవో, టీజీవో నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు . ఇప్పటికైనా ప్రభుతం పై ఉద్యమానికి సిద్ధం కావాలని అన్నారు .

 

లేనిపక్షం లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేసిన వారు అవుతారని హెచ్చరించారు . మరికొంతమంది ఉద్యోగసంఘాల నేతలు మాట్లాడుతూ పీఆర్సీ   అమల్లో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , సీఎం  కేసీఆర్ పిలిచి ఉద్యోగులకు  పీఆర్సీ ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న  అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలు కు కృషి చేస్తోన్న ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ , ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: