శ్రీకాకుళం టీడీపీ అనగానే మొదట గుర్తొచ్చేది దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఎర్రన్న హఠాత్తు మరణంతో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు, సోదరుడు అచ్చెన్నాయుడులు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు. ముఖ్యంగా 2014 నుంచి వీరి హవా ఎక్కువగా నడుస్తుంది. వీరికి చెక్ పెట్టడం వైసీపీ వల్ల కావడం లేదు. సరే 2014 లో టీడీపీ గాలి ఉంది కాబట్టి ఓడించడం కష్టమైందని అనుకున్న,  2019లో వైసీపీ గాలి ఉన్న వారి గెలుపు ఆగలేదు. ఇద్దరు మరోసారి విజయం సాధించారు.

 

అయితే ఎన్నికల్లో ఈ ఫ్యామిలీ మీద పోటీ చేసి ఓడిపోయిన, ఓ ఇద్దరు వైసీపీ యువ నేతలు  ఇంకా గట్టిగా పోరాడుతూనే ఉన్నారు. 2014లో జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నుంచి పోటీ చేసి అచ్చెన్నా చేతిలో ఓడిపోయారు. ఇక 2019కు వచ్చేసరికి జగన్ రూట్ మార్చి, అచ్చెన్నా మీద పేరడా తిలక్ అనే మరో యువ నేతని పోటీకి దించారు. ఇటు శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో రామ్మోహన్ మీద దువ్వాడ శ్రీనివాస్‌ని పోటీ చేయించారు.

 

కానీ ఇద్దరు నేతలు ఊహించని రీతిలో ఓడిపోయారు. అయితే ఓడిపోయిన వారి పోరాటం ఆపలేదు. రోజురోజుకూ ఇంకా కష్టపడుతూ ముందుకెళుతున్నారు. ప్రస్తుతం టెక్కలిలో తిలక్, శ్రీకాకుళం పార్లమెంట్‌కు దువ్వాడలు ఇన్ ఛార్జ్‌లుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎలాగో తమ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి, తమకు పదవులు ఏమన్నా వస్తాయని ఇద్దరు నేతలు ఆశ ఎదురుచూస్తున్నారు.  

 

అయితే తిలక్ విషయం పక్కనబెట్టేస్తే, దువ్వాడ పట్ల జగన్‌ సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. అతనికి భవిష్యత్‌లో ఏదొక పదవి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇక 2024 ఎన్నికలోచ్చేసరికి ఈ ఇద్దరు యువనేతలని గెలుపు తీరాలకు చేర్చి వారి రాజకీయ భవిష్యత్ నిలబెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: