2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. వరుసగా ఆ పార్టీ నేతలు ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారు. రాజ్యసభ ఎంపీలతో మొదలుపెడితే, మొన్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వరకు చాలామంది నేతలు బీజేపీ, వైసీపీల్లోకి జంప్ అయిపోయారు. అయితే ఈ మధ్య వలసలు ఆగిన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు జంపిగులు మొదలవుతాయని తెలుస్తోంది.

 

స్థానిక సమరం ముందే చంద్రబాబుకు కర్నూలులో ఉన్న ఓ బడా ఫ్యామిలీ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఎన్నో ఏళ్లుగా కర్నూలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ తరుపున మూడు సార్లు కర్నూలు ఎంపీగా గెలిచిన కోట్ల, మొన్న ఎన్నికల ముందు టీడీపీ లేదా వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ కూడా మంచి ఆఫర్లే ఇచ్చారు.

 

కానీ కోట్ల రాంగ్ స్టెప్ వేస్తూ, టీడీపీలోకి వచ్చారు. ఎన్నికల్లో సూర్య ప్రకాశ్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే...ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత వీరు టీడీపీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. అటు కుమారుడు రాఘవేంద్రరెడ్డి కూడా అడ్రెస్ లేరు. అయితే స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్నూలులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం కాబట్టి, కోట్ల ఫ్యామిలీ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశముందని అంటున్నారు.

 

వైసీపీలో ఉన్న సోదరుడుహర్షవర్ధన్ రెడ్డి ద్వారా, కోట్ల లాబీయింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. అటు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం నడుస్తుంది. మరి చూడాలి కోట్ల ఫ్యామిలీ బాబుకు షాక్ ఇస్తుందో లేక టీడీపీలోనే కొనసాగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: