కొన్ని దశాబ్దాల పాటు అయోధ్య భూ భాగం పైన వివాదం తాజాగా ముగిసిన  విషయం తెలిసిందే. అయోధ్య భూభాగంలో బాబ్రీ  మసీదు నిర్మించారని ముస్లింల లేదు రామమందిరం నిర్మించాలి అని హిందువుల మధ్య తలెత్తిన వివాదం దశాబ్దాల కాలం పాటు వాయిదా పడుతూ వచ్చింది.ఇక  మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో ఈ వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ భూమి హిందువులకు రామమందిరం  నిర్మించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ముస్లిం ప్రతినిధులు ఆలయ చైర్మన్ పరవశం కు ఓ లేఖ రాశారు. బాబ్రీ మసీదు నిర్మాణం ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని... వాటిపై రామ మందిరాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు ముస్లిం ప్రతినిధులు. 

 

కాగా  రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి ట్రస్ట్  కూడా ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఫిబ్రవరి 15న ముస్లిం ప్రతినిధులు ఆలయ ట్రస్టు అధిపతి పరవశన్ కు లేఖ రాశారు. ధ్వంసం చేయబడ్డ బాబ్రీమసీదు ప్రాంతంలో ముస్లింల సమాదులు  ఉన్నాయని... ముస్లింల సమాధులపై రామ మందిరాన్ని నిర్మించడం హిందూ సనాతన ధర్మానికి విరుద్ధం అంటూ ముస్లిం తరపు న్యాయవాది ఎన్ ఆర్ శంషాద్ పేర్కొన్నారు. కాగా 1885లో జరిగిన అల్లర్లలో సుమారు 75 ముస్లింలు చనిపోయారు అని.. వారందరిని అక్కడే సమాధి చేశారని... ట్రస్ట్  దృష్టికి తీసుకెళ్లారు ముస్లిం ప్రతినిధులు. 

 

 

 బాబ్రీ మసీదు నిర్మించిన ప్రాంతాన్ని గతంలో స్మశానవాటిక గానే వాడారని.. అలాంటి భూమిలో  రామాలయాన్ని ఎలా నిర్మిస్తారు  అంటూ లేఖలో ముస్లిం ప్రతినిధులు ప్రశ్నించారు. ముస్లింల సమాధులపై రాముడి జన్మ స్థాన ఆలయాన్ని ఎలా  నిర్మిస్తారు.. ఇది హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందా.. దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలంటూ ముస్లిం ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలోని మొత్తం 67 ఎకరాలకు సంబంధించిన భూమిని రామ మందిర  నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు ముస్లిం ప్రతినిధులు తరపు న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై అధినేత పరవశన్  ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: