తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా సీఎం పదవి నుంచి తప్పుకోనున్నారు అని మీడియా కోడై కూస్తోంది. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసిఆర్... త్వరలో సీఎం పదవి నుంచి తప్పుకుని తన  రాజకీయ వారసుడు కేటీఆర్ కు సీఎం పదవి అప్ప చెబుతారు అని తెలంగాణ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. ఇక మొన్నటికి మొన్న పార్లమెంటు ఎలక్షన్లలో కూడా... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బిజెపి కి భారీ షాక్ ఇచ్చేందుకు తీవ్ర కసరత్తులు చేశారు కేసీఆర్. గతంలో కేసిఆర్ కు దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.. 

 

 

 అయితే సరైన సమయం కోసం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్న  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దేశ రాజకీయాలు  ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త కాకపోయినా నాటి రాజకీయ సమీకరణాలకు బీజేపీ అధికారం చేపట్టాక రాజకీయ సమీకరణలకు ఎంతో తేడా ఉంది. ఈ క్రమంలోనే  జాతీయ స్థాయిలో బీజేపీ సమీకరణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ కు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పాలని ప్రచారం జరుగుతోంది. 

 

 

 అయితే జాతీయ రాజకీయాల్లో ఉండాలంటే ముఖ్యమంత్రిగా కాకుండా ఎంపీ గా ఉంటేనే బెటర్ అని  అందుకే ఎంపీగా బరిలోకి దిగాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగా కెసిఆర్ కు అచ్చోచ్చిన  కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నిర్ణయంతో ఎంపీ గా మారి బిజెపికి క్రమక్రమంగా చెక్ పెట్టవచ్చునని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గత కొంత కాలంగా కెసిఆర్ ముఖ్యమంత్రి పదవిని తన రాజకీయ వారసుడు కేటీఆర్ కు  కట్టబెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు  అని వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దీనిపై ఎవరు సరిగ్గా స్పందించిన దాఖలాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: