క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  బిజెపి పాలిత రాష్ట్రమైన కర్నాటకలో సిఎం యడ్యూరప్ప కూడా అధికార వికేంద్రీకరణ మొదలుపెట్టారు. బెంగుళూరులో ఉన్న వివిధ శాఖలకు చెందిన 10 కమీషనర్లేట్లతో పాటు వివిధ మండళ్ళను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రంగం డిసైట్ అయిపోయింది. ఈ కార్యాలయాలన్నింటినీ ఉత్తరకర్నాటక ప్రాంతానికి తరలిపోతున్నాయి.

 

ఉత్తర కర్నాటక ప్రాంతంలోని బెళగావి, కలబురగి, ధార్వాడ జిల్లాల్లో పై కమీషనరేట్లు, మండళ్ళను తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అంటే అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ అన్నది ఇప్పటికిప్పుడు యడ్యూరప్ప తీసుకున్నదేమీ కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కుమారస్వామే తీసుకున్నారు. కాకపోతే అప్పటి నిర్ణయాలను సిఎం కాగానే యడ్యూరప్ప అమలు చేస్తున్నారంతే. ఏదేమైనా జగన్ బాటలోనే తాజాగా కర్నాటక సిఎం ఫాలో అవుతున్నట్లు అర్ధమైపోయింది.

 

తమ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ చేస్తున్నారంటే ఇదే పనిని ఏపిలో జగన్ చేస్తున్నపుడు మాత్రం కేంద్రప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది ?  రాష్ట్రంలో  కూడా పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను చేసుకోవాలని జగన్ అనుకున్నారు.  ఇందులో భాగంగానే  కొన్ని శాఖల ప్రధాన కార్యాలయాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించాలని డిసైడ్ చేశారు. జగన్ నిర్ణయాన్ని బిజెపి నేతలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలిసిందే.

 

మొన్ననే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసిన జగన్ మూడు రాజధానుల ఏర్పాటు తదితరాలను వివరించినట్లు సమాచారం. నిజానికి రాజధానుల ఏర్పాటు అంశం కేంద్రానికి ఏమీ సంబంధం లేకపోయినా  మర్యాద పూర్వకంగా విషయాన్ని తెలియజేశారని సమాచారం. జగన్ చేద్దామని అనుకుంటున్న పనిని వ్యతిరేకిస్తున్న కమలం నేతలు ఇదే పనిని కర్నాటకలో యడ్యూరప్ప చేయటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు ? కేంద్రం మాత్రం జగన్ నిర్ణయాన్ని ఎలా వద్దని చెబుతుంది ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: