ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు కాస్త ఎక్కువగానే ఉంటాయన్న సంగతి తెలిసిందే. తమ కుటుంబం అండతో చాలామంది వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎంట్రీ ఇవ్వగానే సక్సెస్ అయిన నేతలు కూడా చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదుగా సక్సెస్ అయిన రాజకీయ వారసుల్లో కాసు మహేష్ రెడ్డి కూడా ఒకరని చెప్పుకోవచ్చు. మహేష్ తండ్రి కాసు కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో కీలకగా నేతగా వ్యవహరించారు.

 

ఆయన నరసారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అలాగే రెండుసార్లు నరసారావుపేట అసెంబ్లీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో మంత్రి కూడా పని చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగుకావడంతో కుమారుడు మహేష్‌తో పాటు వైసీపీలోకి వచ్చేశారు. అయితే మహేష్‌కు 2019 ఎన్నికల్లో గురజాల నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది.

 

ఆ అవకాశాన్ని మహేష్ చక్కగా సద్వినియోగం చేసుకుని, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుని ఓడించి సత్తా చాటారు. దాదాపు 28 వేల ఓట్ల తేడాతో మాహేశ్ విజయం సాధించాడు. తొలిసారి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహేష్ రెడ్డి, నియోజకవర్గంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యకు చెక్ పెట్టడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్-బుగ్గవాగు ద్వారా తాగునీరు అందించడానికి చూస్తున్నారు. పైగా నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్‌ల అభివృద్ధికి పాటు పడుతున్నారు.

 

అయితే అభివృద్ధి విషయంలోనే కాకుండా ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేయడంలో కూడా ముందున్నారు. ఆ పార్టీ చేసే విమర్శలని తిప్పికొడుతూనే తాము అందించే చేసే మంచి కార్యక్రమాలని ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతున్నారు. అయితే అంతా బాగానే ఉన్న కాసుకు కొంచెం దూకుడు ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. మాటతీరులో దురుసుతనం ఉంటుందని అంటున్నారు. పైగా ఇటీవల కొందరు కాలేజ్ విద్యార్ధులపై కూడా నోరు పారేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటి వల్లే కాస్త నియోజకవర్గంలో కాసుకు ఇబ్బందికర పరిస్తితి ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: