నైతికత మీద తెలుగుదేశంపార్టీ ఫిర్యాదులు చేయటం పెద్ద జోక్ గా తయారైంది. తెలుగు రాష్ట్రాల్లో  ఐదు రోజుల పాటు జరిగిన ఐటి దాడుల వ్యవహారాన్ని సాక్షి మీడియా చంద్రబాబునాయుడుకు ఆపాదిస్తు బురద చల్లుతున్నట్లు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ కు ఫిర్యాదు చేయటమే విచిత్రంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నైతిక విలువలను తుంగలో తొక్కిందే అసలు తెలుగుదేశంపార్టీనే అన్న విషయమై ఎన్ని ఆరోపణలున్నాయో అందరికీ తెలిసిందే.

 

ఇక ఐటి దాడుల విషయంలో   చంద్రబాబుపై బురద చల్లటాన్నే తీసుకుంటే దీనికి మూలం ఐటి అధికారికంగా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజే. ప్రముఖ వ్యక్తి దగ్గర పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, టిడిపి కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, లోకేష్ బినామీగా ప్రచారంలో ఉన్న కిలారు రాజేష్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు కంపెనీలపై ఐటి దాడులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

 

తమ దాడుల్లో ప్రాధమికంగా రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తమకు దొరికినట్లు ఐటి శాఖ స్పష్టంగా ప్రకటించింది. ఆ లేఖ ప్రకారమే శ్రీనివాస్ పనిచేసింది చంద్రబాబు దగ్గరే. అందుకనే మంత్రులు, వైసిపి నేతలు చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇందులో వైసిపి ప్రత్యేకంగా చంద్రబాబుపై  బురద చల్లుతున్నదేమీ లేదు. ఆరోపణలు చేయటాన్నే బురద చల్లటమని టిడిపి అనుకుంటే ఇదే పద్దతిలో టిడిపి నేతలు ఆరితేరిపోయారు.

 

లక్ష కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడని గడచిన పదేళ్ళుగా చంద్రబాబు అండ్ కో కొన్ని లక్షల సార్లు బురద చల్లుంటారు. జగన్ లక్ష కోట్లు దోచేసుకున్నాడని చంద్రబాబు అండ్ కో కు ఎవరు చెప్పారు ? కోర్టులో విచారణలో ఉన్న కేసుల్లో బయటపడిందా ? లేకపోతే దర్యాప్తు  సంస్ధలేమన్నా కోర్టుకు లెక్కలు చెప్పాయా ? మరి ఏమీ లేకుండానే జగన్ పై టిడిపి ఎలా బురద చల్లుతోంది ? నైతిక విలువలను తుంగలో తొక్కేసిన టిడిపి నైతిక విలువల గురించి సాక్షి మీడియాపై ఫిర్యాదు చేయటమే విచిత్రంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: