ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌ లో 127 మందికి  ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడం పై స్పందించారు. ఈ 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీస్, ఆధార్ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీని పై తెలంగాణ డీజీపీ సమాధానం ఇవ్వాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. 

 

 

పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఆధార్ సంస్థకు లేదని ఆయన ట్విట్టర్ వేదికగా వారికి గుర్తు చేశారు. అలా అయితే..  తెలంగాణ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించే సమయంలో వారిని ఆధార్ అడగడం మానేయాలని సూచించారు.

 

 

127 మంది వ్యక్తులు తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డు పొందారనే ఆరోపణల పై వీరికి యూఐడీఏఐ నోటీసులు జారీ చేసింది. వీరంతా ఒకరి తర్వాత మరొకరు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ పై ముస్లింలు దేశ వ్యాప్త పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ ఎన్ని పోరాటాలు చేసిన ప్రజలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ విషయం పై పలు నాయకులు, సెలబ్రిటీలు స్పందించారు. అయితే ఇటీవల ఈ విషయం పై సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. అయితే ఆయన సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ కి మద్దతుగా స్పందించారు. కాగా. , ఆయన పై పలు రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టాలను అధికారికంగా ఇంకా పాలనలోకి తీసుకు రాలేదని చెప్పిన అల్లర్లు మాత్రం ఆగడం లేదు.

 

 

ఈ నేపథ్యంలో 127 మందికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మైనారిటీలు, దళితులు లక్ష్యంగానే ఈ వేధింపులు చేస్తున్నారని అసదుద్దీన్ ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి నోటీసులు జారీ చేసి అన్ని గుర్తింపు పత్రాలను మళ్లీ పరిశీలిస్తామని అంటున్నారని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: