శాసనమండలి వివాదం  కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకూ శాసనమండలి ఛైర్మన్-కార్యదర్శి-టిడిపి మధ్య ఉన్న వివాదంలోకి సచివాలయం ఉద్యోగుల సంఘం ఎంటరయ్యింది. లేని అధికారాలు ఉన్నాయని చెబుతూ ఛైర్మన్ తనిష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తనంతట తానుగా రెండు బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు ఛైర్మన్ చేసిన ప్రకటనతో కంపు మొదలైంది. ఛైర్మన్ కూడా టిడిపి సభ్యుడే కావటంతో చంద్రబాబునాయుడు, పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కంపు రాజకీయాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

స్వతహాగా ఛైర్మన్ మెతక మనిషి కావటంతో జగన్మోహన్ రెడ్డిపై   చంద్రబాబు, యనమల తమకున్న కసినంతా తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై ఛైర్మన్ తో గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేయించారు. కార్యదర్శిపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయించి, సస్పెండ్ చేయాలంటూ గవర్నర్ కు రాత మూలకంగా ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది.

 

ఛైర్మన్ చెప్పినట్లు వినకపోతే నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న కార్యదర్శిని కోర్టుకీడుస్తామని, సస్పెండ్ చేయిస్తామని, అరెస్టు చేయిస్తామంటూ యనమల చాలాసార్లు మీడియాలె బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే సచివాలయం ఉద్యోగుల సంఘం సీన్ లోకి  ఎంటరైంది. నియమ, నిబంధనల ప్రకారం పనిచేస్తున్న కార్యదర్శిపై టిడిపి నేతలు బెదిరింపులకు దిగటమేంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కార్యదర్శిని బెదిరిస్తున్న వాళ్ళని కట్టడి చేయాలంటూ ప్రభుత్వ కార్యదర్శి నీలం సహానిని కోరటం సంచలనంగా మారింది.

 

ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే అధికారంలో ఉన్నపుడు తాము అనుకున్నట్లుగా చేసుకువెళ్ళిన టిడిపి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా తాము కోరుకున్నట్లే జరగాలని పట్టుబట్టడుతోంది. అంటే అధికారంలో ఉన్నపుడు నిబంధనలను పట్టించుకోలేదు. ప్రతిపక్షంలోకి మారిన తర్వాత కూడా అధికారులు నిబంధనలను ఉల్లంఘించి తాము చెప్పినట్లే చేయాలని  కోరుకుంటోంది. ఇక్కడే సమస్య మొదలైంది. మరి ఉద్యోగు సంఘం ఎంటరైన తర్వాత ఏమవుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: