40 ఏళ్ల అనుభవం ఉంది అన్న చంద్రబాబు కి చుక్కలు మీద చుక్కలు చూపిస్తున్నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని చావుదెబ్బ రాజకీయంగా కొట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక బాబుకి కంటి మీద కునుకు లేకుండా ఏపీలో అద్భుతమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎంతో ముద్దుగా కట్టుకున్న ప్రజా వేదికను కూల్చేసి టిడిపి పునాదులు కదిలేలా వరుసగా నిర్ణయాలు తీసుకున్నాడు జగన్. చంద్రబాబుని కరకట్ట మీద ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ నుండి ఖాళీ చేయించారు. ఆ తర్వాత అనేక రీతులుగా చంద్రబాబుని రాజకీయంగా ఇరుకున పెట్టిన జగన్ అమరావతి రాజధాని విషయంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ బాగోతం మొత్తం అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టడం జరిగింది.

 

అయితే ఈ యొక్క అమరావతి రాజధాని భూముల విషయంలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తన వర్గానికి పార్టీ నేతలకు మేలు చేకూర్చడం కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఈ రాజధాని భూ దోపిడీ కేసును సి.ఐ.డి కి మరియు ఈడికి జగన్ సర్కార్ అప్ప చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు కి పూర్తిగా భద్రత తగ్గించినట్లు 160 నుండి 58 కి జగన్ సర్కార్ తగ్గించేసింది అని ఇటీవల టిడిపి నాయకులు పేర్కొనటం జరిగింది. ఇదే సందర్భంలో వారం రోజుల క్రితం రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజి నుంచి చంద్రబాబు పర్సనల్ సెక్రటరీకి ఒక లేఖ రాసినట్లు ఆ లెటర్ ప్రకారం చంద్రబాబు బద్రతను, 58కి తగ్గించినట్టు  జెడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా, 160 మంది సిబ్బంది బద్రతగా ఉండే వారు. అయితే, ఇప్పుడు తాజగా నిఘా ఐజి పంపించిన లేఖలో, 58కి తగ్గించినట్టు లెటర్ వచ్చినట్లు టిడిపి ఆరోపించింది.

 

అయితే ఇంతలోనే రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి అసలు చంద్రబాబు కి సెక్యూరిటీ తగ్గింది అన్న వార్తలలో వాస్తవం లేదని చంద్రబాబుకి ఎలాంటి బద్రత తగ్గించలేదని, 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఇక్కడ 135 మంది, హైదరాబాద్ లో 48 మందితో బద్రత ఇస్తున్నట్టు చెప్పింది. అయితే టిడిపి ఆరోపిస్తున్న వార్తలలో వాస్తవం లేదని తేలిపోవడంతో మరోసారి నవ్వుల పాలైంది. అయితే తాజాగా రాష్ట్ర డీజీపీ స్వయంగా లెటర్ రాయడం తో ఇదెక్కడి రాజకీయం రా బాబు అంటూ చంద్రబాబు అండ్ కో వర్గం లబోదిబోమంటున్నట్లు టిడిపి పార్టీలో వార్తలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: