ఫిబ్రవరి 20వ తేదీన చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది మరణాలు ఇంకెంతో మంది జననాలు జరిగాయి. మరి ఒక్కసారి నేడు హిస్టరీ లోకి వెళ్లి చూసి నేడు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ముందుగా 1956 ఫిబ్రవరి 26న పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. 

 

 మహారాష్ట్ర గవర్నర్ : 1988 ఫిబ్రవరి 20వ తేదీన మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లాకు చెందిన కాసుబ్రహ్మానందరెడ్డి కేంద్ర రాష్ట్రాల్లో మంత్రిపదవులు తో పాటు అనేక పదవులను కూడా అలంకరించారు. 

 

 మల్లాది సూర్యనారాయణ జననం : ప్రముఖ రంగస్థల రచయిత దర్శకుడు నటుడు కళాకారుల సేవ చేస్తున్న వ్యక్తి అయినా మల్లాది సూర్యనారాయణ 1880 20వ తేదీన జన్మించారు. ఇలా ఎన్నో నాటకాలు రాసి..  పేరు ప్రతిష్టలు పొందారు. రంగస్థల నటులు ఒక వెలుగు వెలిగినా కళాకారులు మల్లాది సూర్యనారాయణ. ఇక రంగస్థల నటులు దీనాతిదీనంగా జీవించడం చూసి వారి కోసం నటరాజ కళా పీఠం అనే సంస్థను నెలకొల్పి వారి జీవితాలు చేకూరుస్తున్నారు మల్లాది సూర్యనారాయణ. ఈయన వ్రాసిన రచనలు కు గాను వేసిన నాటకాలకు గాను ఎన్నో బహుమతులు కూడా సాధించారు.

 

 రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు జననం : బొబ్బిలి వంశానికి చెందిన 13వ రాజు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు 1901 ఫిబ్రవరి 20వ తేదీన జన్మించారు. ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా కూడా జస్టిస్ పార్టీ వ్యక్తి గా 1932 నుండి 1936 వరకు నిర్వహించారు. 

 

 గొల్లకోట బుచ్చి రామశర్మ జననం : జీవ రసాయన శాస్త్రము పౌష్టికాహారం ఫార్మా యూనిట్  రంగాల్లో ఎంతో విలువైన పరిశోధనలు చేశారు గొల్లకోట బుచ్చి రామశర్మ. 1915 ఫిబ్రవరి 20వ తేదీన జన్మించారు. 


 గిరిజా ప్రసాద్ కోయిరాలా జననం : నేపాల్ మాజీ ప్రధానమంత్రి అయిన గిరిజా ప్రసాద్ కోయిరాలా 1925 ఫిబ్రవరి 20వ తేదీన జన్మించారు. నేపాల్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు నాలుగు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు గిరిజా ప్రసాద్ కోయిరాలా. 

 

  నేదురుమల్లి జనార్దన్రెడ్డి జననం : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్రెడ్డి 1931 ఫిబ్రవరి 20వ తేదీన జన్మించారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలలో ఒకడైన జనార్దన్ రెడ్డి 1992 నుంచి 94 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004 సంవత్సరంలో లోక్సభ ఎన్నికలలో విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 

 

 విజయనిర్మల జననం : ప్రముఖ నటి నిర్మాత దర్శకురాలు అయినా విజయనిర్మల 1946 జూన్ 20వ తేదీన జన్మించారు. విజయ నిర్మలా  నలభై నాలుగు చిత్రాలకు పైగా  దర్శకత్వం కూడా వహించారు. దీనికిగాను అత్యధిక చిత్రాలను దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. కాగా   తెలుగులో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ ను  వివాహం చేసుకున్నారు విజయ నిర్మలా . విజయనిర్మల సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య అవార్డును కూడా పొందరు. విజయనిర్మల కృష్ణ దంపతులకు ఓ కొడుకు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్ విజయనిర్మల తనయుడు. కాగా ఈమె జూన్ 26 2019 లో మరణించారు. 


 నంద్యాల శ్రీనివాస్ రెడ్డి మరణం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు మాజీ శాసనసభ సభ్యుడు అయిన నంద్యాల శ్రీనివాస్ రెడ్డి 2019 ఫిబ్రవరి 20వ తేదీన మరణించారు. 


 టీవీ రాజు మరణం : తెలుగు తమిళ కన్నడ భాషల్లో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన టీవీ రాజు 1973 ఫిబ్రవరి 20వ తేదీన మరణించారు. 


 బి.పద్మనాభం మరణం : తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు అయిన బి.పద్మనాభం 2010 ఫిబ్రవరి 20వ తేదీన మరణించారు. ఈయన  పలు సినిమాలను నిర్మించడంతో పాటు ఎన్నో సినిమాలకు దర్శకుడిగా కూడా సినిమాలను తెరకెక్కించారు. అంతేకాకుండా హాస్య నటుడిగా కూడా బి.పద్మనాభం ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: