ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశ స్థాయి లోనే జాతీయ నాయకులను ప్రభావితం చేసేటట్లు ఉన్నట్లు చాలా సందర్భాలలో తేలింది. ఇందు మూలంగానే ఇటీవల దేశంలోనే మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రులలో మూడవ స్థానాన్ని జగన్ దక్కించుకున్నట్లు చాలామంది రాజకీయ మేధావులు జగన్ పరిపాలన గురించి కామెంట్ చేశారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని సమపాళ్ళలో అందిస్తూ జగన్ దేశ రాజకీయాలను శాసించే విధంగా దక్షిణ భారతదేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ప్రస్తుతం తయారు అవుతున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు.

 

ఇలాంటి దారుణం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పరిపాలన చూసి ఇతర రాష్ట్రాల్లో ఫాలో అవుతున్నట్లు కామెంట్ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అప్పులు, దారితెన్నూ లేని అధికార వ్యవస్థ సీఎం జగన్‌కు ఆహ్వానం పలికాయని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేశారని.. ఆయన హయాంలో గాడి తప్పిన పాలనను పట్టాలెక్కించిన సీఎం జగన్‌.. అనతికాలంలోనే పలు సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు.

 

సలహాదారుగా ప్రభుత్వాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నానని... సీఎం జగన్‌ పాలన పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఎనిమిది నెలలు మాత్రమే అయిందని ఇంకా చాలా మంచి పనులు రానున్న రోజుల్లో జగన్ చేయబోతున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు గమనించాలని జగన్ కి మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: