కేంద్రంలోని బిజెపి ఓ పద్దతి ప్రకారం ప్రత్యర్ధులను నరుక్కుని వస్తున్నట్లు అనుమానంగా ఉంది. ముందుగా తన వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ వైపు నుండి నరుక్కొస్తోంది. ఇందులో భాగంగానే ఆమధ్య కర్నాటకలోని ప్రముఖ నేత  డికె శివకుమార్ ను పట్టుకుంది. ఐటి దాడులని, ఈడి  కేసులని ఉచ్చు బిగించేస్తోంది. తాజాగా గుజరాత్ లోని అహ్మద్ పటేల్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం.

 

డికే పై జరిపిన దాడులకు సంబంధించి అహ్మద్ పటేల్ తో బంధంపై ఆధారాలు దొరికాయట. డికె దగ్గర దొరికిన డైరీల్లో హవాలా మార్గంలో పటేల్ కు చంద్రబాబు  రూ. 400 కోట్లు పంపినట్లు ఉందట. అందుకనే రూ. 400 కోట్లకు సంబంధించిన వ్యవహారాంలో  విచారించాలంటూ ఐటి నోటీసులిచ్చింది.  ఫిబ్రవరి 14వ తేదీన విచారణకు రమ్మని నోటీసులిస్తే హాజరుకాలేదు. రెండోసారి 18 వ తేదీన కూడా రాలేదు. మూడో సారి నోటీసులిస్తే  అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరినట్లు పటేల్ సమాధానం ఇచ్చారు.

 

సరే అహ్మద్  సంగతి ఈరోజు కాకపోయినా రేపైనా దర్యాప్తు సంస్ధలు చూసుకుంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అహ్మద్ దాకా వచ్చిన ఐటి, ఈడి దర్యాప్తు బృందాలు చంద్రబాబునాయుడు దగ్గరకు రావటానికి ఎంతో కాలం పట్టదనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాల్లో కర్త, కర్మ, క్రియ మొత్తం అహ్మద్ పటేలే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి అహ్మద్ కు చంద్రబాబు ఆర్ధిక అండదండలు అందించినట్లు ఆధారాలతో సహా బయటపడిందట.

 

నరేంద్రమోడితో చెడిపోగానే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన చంద్రబాబు వెంటనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఉత్తరాధితో పాటు తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు భారీగా నిధులు సర్దుబాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ విజయంలో తన పాత్ర కూడా ఉందంటూ చంద్రబాబు బహిరంగంగా చేసిన ప్రకటనే నిధుల సర్దుబాటును తెలియజేస్తోంది. తమకు వ్యతిరేకంగా చంద్రబాబుకు కాంగ్రెస్ వందల కోట్ల రూపాయలు సాయం చేశారనే విషయంపైనే మోడి మండిపోతున్నారట.  ఇందుకే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: