ఎన్నికల ముందు, తర్వాత వైసీపీలో చేరిన రెండు ‘తోట’ కుటుంబాలకు రాజకీయ భవిష్యత్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయా? భవిష్యత్‌లో వారికి అవకాశాలు రావడం కష్టమా? అంటే ప్రస్తుత పరిస్తితులని చూస్తుంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట నరసింహం కుటుంబం 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. మొదట కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన నరసింహం, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచారు.

 

ఇక 2019 ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసి, వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే నరసింహం అనారోగ్యం వల్ల ఎన్నికలకు దూరమైతే ఆయన భార్య వాణికి జగన్ పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె అనూహ్యంగా చినరాజప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి నరసింహం కుటుంబం వైసీపీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. పైగా వీరి ఏ పదవి వచ్చే అవకాశం లేదు. అలా అని వచ్చే ఎన్నికల్లో ఏమన్నా సీటు వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు.

 

ఈ ఫ్యామిలీ పరిస్తితి ఇలా ఉంటే ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు పరిస్తితి ఏంటో కూడా అర్ధం కాకుండా ఉంది. 2014లో టీడీపీ తరుపున రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన త్రిమూర్తులు...2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేశారు. తనకు, తన కుమారుడుకు సీటు కావాలని డిమాండ్ చేస్తే, ఆ డిమాండ్‌కు జగన్ ఒప్పుకోలేదు. దీంతో త్రిమూర్తులు మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేసి చెల్లుబోయిన వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు.

 

ఓడిపోయాక టీడీపీని వదిలేసి వైసీపీలోకి వచ్చారు. పార్టీలోకి వచ్చాక త్రిమూర్తులని వైసీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గపార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తప్ప పెద్ద పదవి ఏమి ఇవ్వలేదు. అయితే 2024 ఎన్నికల్లో కూడా తోటకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎందుకంటే రామచంద్రాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక మిగిలినవి కూడా ఖాళీగా లేవు. దీని బట్టి చూస్తే త్రిమూర్తులు కూడా వైసీపీలో ఖాళీగా ఉండాల్సిందే. మొత్తానికైతే తోట ఫ్యామిలీస్ పోలిటికల్ ఫ్యూచర్ శూన్యంగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: