తెలంగాణ రాష్ట్రంలోని పదవులు దక్కని నేతలందరూ ప్రస్తుతం తెగ టెన్షన్ పడుతున్నారు. ప్రగతి భవన్ చుట్టూ, తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతూ తమకో పదవి ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సందడి ముగియడంతో సీఎం కేసీఆర్ తమకు పదవులు ఇస్తారో లేదో అని ఆందోళన చెందుతున్నారు. పదవులు దక్కని వారి సంఖ్య భారీగా ఉండటంతో నామినేటెడ్ పదవుల కొరకు టీఆర్ఎస్‌ పార్టీ నేతలంతా పైరవీలు మొదలుపెట్టారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో 2018లో అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఎన్నికలు గత వారం వరకు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో మరలా చెప్పుకోతగ్గ ఎన్నికలు అంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే. పార్టీలో కొంత మంది నేతలు జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, మున్సిపల్ ఛైర్మన్లుగా, మేయర్లుగా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ అవకాశాలు రాని వారి సంఖ్య భారీ సంఖ్యలో ఉండటంతో నామినేటెడ్ పదవుల కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. 
 
సీఎం కేసీఆర్ కంట్లో పడితే తమకు నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉందని టీఆర్ఎస్‌ పార్టీ నేతలు భావిస్తున్నారు. కొందరు కేసీఆర్ దృష్టిలో పడటానికి కేసీఆర్ పుట్టినరోజున ప్రగతిభవన్ కు వెళ్లి శుభాకాంక్షలు తెలపగా మరికొందరు మాత్రం కార్యక్రమాలను నిర్వహించి కేసీఆర్ దృష్టిలో పడటానికి ప్రయత్నాలు చేశారు. కొందరు కేసీఆర్ ను తమ పదవి విషయం గురించి ఆలోచించాలని కోరారు. 
 
కొందరు నేతలు తాము ఎమ్మెల్సీ సీట్లను, రాజ్యసభ సీట్లను ఆశిస్తున్నామని తమ మనస్సులోని కోరికలను సీఎం కేసీఆర్ కు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు కేటీఆర్ ను కూడా కలిసి తమ మనస్సులోని మాటను చెప్పుకున్నారు. టీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఇప్పుడు అవకాశం మిస్ అయితే మాత్రం మరలా అవకాశం రావడం కష్టమని తీవ్రంగా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులు దక్కకపోతే మాత్రం కొందరు నేతలు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: