ఇప్పటి వరకు తన మార్క్ పరిపాలన ఏవిధంగా ఉందో చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇకపై తన కుమారుడు కేటీఆర్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది తెలంగాణ ప్రజలకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. చాలా కాలంగా కేటీఆర్ ను సీఎంగా ఏం చేయాలని ఆలోచిస్తున్నా కేసీఆర్. దానికి తగ్గట్టుగానే చాపకింద నీరులా కసరత్తు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా దానికి తగ్గట్టుగానే తన ప్రతిభను అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ లో భారీగా మార్పులు చేర్పులు చేసి కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు.


 ఇప్పటికే కేటీఆర్ కు అనుకూలంగా ఉన్న కొంత మంది శాసనసభ్యులను గుర్తించిన ఆయన వారికి మంత్రి పదవులు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మల్ల రెడ్డి తో పాటు మరో ఇద్దరు ముగ్గురు వ్యవహారశైలిపై కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మినహా మిగిలిన ఇద్దరు ముగ్గురు మంత్రుల విషయంలోనూ కేసీఆర్ కూడా అసంతృప్తి గా ఉండడంతో వారిని తప్పించడం దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ కు నచ్చిన వారిని, ఆయనకు అనుకూలంగా ఉండే వారిని మంత్రిగా నియమిస్తే కెసిఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కేసీఆర్ ఆలోచన.


 ఇప్పటికే మున్సిపల్ చైర్మన్, మేయర్ల విషయంలో కేటీఆర్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియమించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ మాటకు ఎదురు లేకుండా చేయడం ద్వారా పరిస్థితిని అనుకూలంగా మార్చవచ్చు అనేది కేసీఆర్ ఆలోచన. అందుకే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని  కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరు పై సర్వే చేయించిన కెసిఆర్ ముగ్గురుని మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. అందులో మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పేర్లు ఉన్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. 


మల్లారెడ్డి ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారరు. ఇక జగదీశ్వర్ రెడ్డి విషయంలో కేసీఆర్ సంతృప్తికరంగానే ఉన్నా కేటీఆర్ మాత్రం ఆయన వైపు సానుకూలంగా లేకపోవడంతో మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: