జనేసన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.  ఈ సందర్బంగా ఆయన కేంద్రీయ సైనిక బోర్డుకు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఢిల్లీ వెళ్లిన జనసేనాని స్వయంగా సైనికాధికారులకు చెక్ అందజేశారు. ఇక జనసేన అధ్యక్షుడు ఢిల్లీ పయణం అనగానే తెలుగు రాష్ట్రాల్లో రక రకాల చర్చలు మొదలయ్యాయి.  గత కొంత కాలంగా ఆయన బీజేపీ ముఖ్యనేతలతో టచ్ లో ఉంటున్న విషయం తెలిసిందే.  కాగా, గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్.. అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు.  

 

ఇటీవల సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని డిసెంబర్ 6, 2019న పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్వయంగా తానే విరాళాన్ని అందిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం ఆయన నేడు ఢిల్లీ వెళ్లి కోటి రూపాలు విరాళం అందించి తన మంచి మనసు మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. కోటి రూపాయలు విరాళంగా ఇద్దామని అనుకున్నాను. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు.. ఇప్పుడొచ్చి ఇచ్చాను. జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు సైనిక బోర్డుకు తమ వంతు సాయాన్ని అందించాలి  అన్నారు.

 

ఇక ఢిల్లీ పయణం అనగానే రాజకీయ నేతలను ఎవరినైనా కలిసయో యోచనలో ఉన్నారా అన్న ప్రశ్నకు.. ఢిల్లీలో రాజకీయ నేతలను ఎవరినైనా కలుస్తానా? లేదా? అన్న విషయంపై ఏమీ చెప్పలేను నిర్ణయం తీసుకోలేదు అని సమాధానం ఇచ్చారు.  అయితే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనాలని తనకు ఆహ్వానమందిందని తెలిపారు.  ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞాన్ భవన్‌కు వెళ్లి ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: