ఒక్కోసారి అధికారుల అత్యుత్సాహం వారికి ఎక్కడ లేని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా వినియోగం విషయంలో ఎదురవుతున్నసమస్యల కారణంగా ఒక్కోసారి పెద్ద స్థాయి అధికారులు కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా ఓ కలెక్టర్‌ అలాంటి ఇబ్బందుల్లోను పడ్డాడు. ఆయన సోషల్‌ మీడియా పేజ్‌ నుంచి ఓ హీరోయిన్‌ పోస్ట్‌కు ఇచ్చిన రిప్లై సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ట్విటర్‌ అకౌంట్‌ నుంచి పోస్ట్ అయిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న హీరోయిన్  రష్మిక తన సోషల్ మీడియా పేజ్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటలకు రిప్లైగా చించావు పో అంటూ రవి అకౌంట్‌ నుంచి కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యక్ చేశారని రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 

కలెక్టర్ రవి మాత్రం ఈ ట్వీట్ తాను చేయలేదని చెబుతున్నారు. ఈ విషయమై  ఆయన పోలీసులను ఆశ్రయించారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని రవి  అనుమానిస్తున్నారు. ఈ మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ సంఘటన మీద విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని కోరారు.

 

ప్రస్తుతం కలెక్టర్‌ ట్విటర్‌ పేజ్‌లో ఆ ట్వీట్ లేదు. మరి ఆయనే డిలీట్ చేశారా..? లేక హ్యాక్‌ చేసిన పోస్ట్ చేసిన వ్యక్తులే తరువాత ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కలెక్టర్ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు, ఎక్స్‌పర్ట్స్‌ సాయంతో హ్యాకర్స్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: