ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు తాజాగా బుధ‌వారం ప్రారంభించిన ప్ర‌జాచైత‌న్య యాత్ర 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగ‌నుంది. అయితే, ఇది ఎప్ప‌టికి పూర్త‌వుతుంద‌నేది మాత్రం షెడ్యూల్‌లో చెప్ప‌లే దు. ఇక‌, బుధ‌వారం ఆయ‌న ప్ర‌కాశం జిల్లాలో దీనిని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌తో ఆయ‌న మాట్లాడారు. దాదాపు రెండుగంట‌ల‌కు పైగా ఆయ‌న బ‌స్సుపైనే ఉండి ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌సంగాలు ప్రారంభించారు.



ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతూ బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. మీరంతా రోడ్ల మీద‌కు రావాలి.. అంటూ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపు నిచ్చారు. అదే స‌మ‌యంలో.. ఈ ప్ర‌భుత్వం కేసులు పెట్టి జైలుకు పంపితే.. అంద‌రం వెళ్తాం అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టినా అంద‌రూ సిద్ధంగానే ఉండాల‌ని చెప్పారు. ప్ర‌జావేదిక కూల‌గొట్టిన ఘ‌ట‌న నుంచి ఇసుక ల‌భ్య‌త మూడు రాజ‌ధానుల విష‌యం వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు అనేక విమ‌ర్శ‌లు చేశారు.



అయితే, ఆయ‌న పిలుపు, ఆవేద‌న‌, ఆందోళ‌న అంతా కూడా ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల్సింది పోయి.. వారిని రెచ్చ‌గొట్టేలా ఉండ‌డం వెను క వ్యూహం ఏంటి? అనేది కీల‌క ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌ల‌కు అందాల్సిన అన్ని ప‌థ‌కాలు అందుతున్నాయి. పింఛ‌న్లు కూడా ఇస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇళ్లు కూడా ఇస్తున్నారు. సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో ప్ర‌జ‌ల‌ను ఇలా రెచ్చ‌గొట్ట‌డం వెనుక బాబు వ్యూహం ఏంట‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. నిజానికి ఈ ప‌ది మాసాల్లో చంద్ర‌బాబు తీసుకున్న ఏ పోరాటం కూడా స‌క్సెస్ కాలేదు.



రాజ‌ధానుల విష‌యంలో కేంద్రం చేతులు ఎత్తేసింది. త‌న ప‌రిధిలోని అంశం కాద‌ని చెప్పేసింది. ఇక‌, ఇత‌ర విష‌యాల్లోనూ కేంద్రం జోక్యం చేసుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో బాబును న‌మ్మి ఇప్ప‌టికేరోడ్ల మీద‌కు వ‌చ్చిన‌వారు ఒక్క‌రొక్క‌రుగా త‌ప్పుకొంటున్నారు. దీనికితోడు ఐటీ అధికారులు బాబును టార్గెట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న హ‌వా ఎక్క‌డ త‌గ్గిపోతుందోన‌ని భావిస్తున్న చంద్ర‌బాబు ఇలా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నార‌నే విశ్లేష‌కుల అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఏదైనా త‌ప్పులు ఉంటే ప్ర‌జ‌ల‌కు చెప్పాలి. ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేయాలి. కానీ, చంద్ర‌బాబు మాత్రం రెచ్చ‌గొట్ట‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: