40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల దెబ్బ చంద్రబాబు రాజకీయ పునాదులను షేక్ చేసి పారేసింది. అదే తరుణంలో జగన్ కూడా దూకుడు రాజకీయాలు చేయడంతో వయసు మీద పడిన చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు. బలహీనమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయంలో సమర్థవంతంగా ఇరుకున పెట్టే విధంగానే వ్యవహరిస్తున్నారు. కానీ సంఖ్యా బలం ప్రతిపక్షంలో లేకపోవడంతో చంద్రబాబు చేస్తున్న కామెంట్లకు పెద్దగా పార్టీ నుండి సరైన రెస్పాండ్ రావడం లేదు.

 

మరోపక్క చంద్రబాబుకి సహకరించే నాయకులు కూడా పెద్దగా పార్టీలో కనబడటం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా ఉన్న నాయకులు ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలని దాదాపు ఎన్నికల ముందు నుండి చంద్రబాబుకి చెబుతూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు అందరూ చెప్పే ఐడియాని ఇన్నాళ్ళకి చంద్రబాబు అంగీకరించినట్లు టిడిపి పార్టీలో టాక్ వినపడుతోంది. విషయంలోకి వెళితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చంద్రబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ బలం రోజురోజుకీ పెరగడంతోపాటు అన్ని విషయాల్లోనూ దూకుడు కనబరుస్తున్నారు. పైగా ఇప్పుడు బాబుపై కేసులు నడవబోతున్నాయి. ఎప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందో చెప్పలేని స్థితి. లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తే పార్టీ నడుస్తుందని గ్యారెంటీ లేదు. దీంతో పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబుకి బలంగా చెప్పటంతో బాబు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: