ఏపీలోని జగన్ ప్రభుత్వం అన్నిటిల్లోనూ ఫెయిల్ అయిందని చెప్పి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరిట రోడ్ల మీదకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభించి, ఎప్పటిలానే తన బోరింగ్ స్పీచ్‌తో ప్రజలకు బోరు కొట్టించారు. అయితే స్థానిక ఎన్నికలు వస్తుండటంతోనే బాబు ఇలా యాత్రల పేరుతో ప్రజలకు వెళ్ళే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇలానే బాబు యాత్ర సజావుగా సాగిపోతే, జనాల్లో కాస్త టీడీపీ పేరు వినపడుతుంది.

 

దాని వల్ల వైసీపీకి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే పరిస్తితి రావోచ్చు. ఇలాంటి తరుణంలోనే టీడీపీ యాత్రకు చెక్ పెట్టేందుకు జగన్ ఓ అదిరిపోయే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఎలాగో మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్ధతుగా పోరాటం చేస్తున్నారు కాబట్టి, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాబుకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో వైసీపీ శ్రేణుల ద్వారా బాబు యాత్రకు నిరసనలు తెలియజేసే కార్యక్రమం చేయించే ఛాన్స్ ఉంది.

 

పైగా తాజాగా అమరావతికి వెళ్ళిన రోజాని అక్కడి టీడీపీ శ్రేణులు, రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంగా ఉన్నా రోజా, బాబు యాత్రని సజావుగా సాగనివ్వం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన యాత్రకు అడుగడుగన అడ్డు పడతామని చెప్పేశారు. దీని బట్టి చూసుకుంటే బాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆ సమయంలో టీడీపీ కేడర్ ఏమన్నా కాస్త ఎక్కువ చేస్తే కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.

 

అయితే బాబు యాత్రకు నిరసనలు తెలియజేస్తే, ప్రజల్లో కూడా టీడీపీ పట్ల అంత సానుకూలత రాదు. ఇంకా టీడీపీ మీద వ్యతిరేకిత ఉందనే భావన కొనసాగుతుంది. ఈ పరిణామాలతో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: