ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవిలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా సంగతి అందరికీ తెలిసినదే. ఒకపక్క సంక్షేమం మరోపక్క రాష్ట్ర అభివృద్ధిని చేసుకుంటూ దూసుకుపోతున్న వైయస్ జగన్ పరిపాలన దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే విధంగా ఉంది అంటూ చాలా మంది రాజకీయ మేధావులు అంటున్నారు. ఇందుమూలంగానే ఇటీవల దేశంలోనే ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రులలో మూడవ స్థానాన్ని జగన్ కైవసం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న జగన్ ...పరిపాలనలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

అంతేకాకుండా ప్రభుత్వం నుండి ప్రజలకు వెళ్లే సంక్షేమ ఫలాల విషయంలో కులం, మతం, ప్రాంతీయత అనేది లేకుండా ఆ పార్టీపార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడం జరిగింది. అయితే 8 నెలల పరిపాలన గురించి జగన్ తాజాగా ఇటీవల మొత్తం రిపోర్ట్ రాష్ట్రవ్యాప్తంగా తెప్పించుకున్నట్లు సమాచారం. అయితే ఈ రిపోర్టులో కొత్తగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరియు పెన్షన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సానుకూలంగా ఉన్నట్లు రిపోర్టులో తేలినట్లు సమాచారం. కానీ ఇదే తరుణంలో అమరావతి రాజధాని విషయంలో జగన్ అనుసరించిన వైఖరి పట్ల రిపోర్టులో జగన్ కి మైనస్ పార్కులు పడినట్లు వైసిపి పార్టీలు వినబడుతున్న టాక్.

 

కేవలం రాజధాని అమరావతి విషయంలో తప్ప అన్ని విషయాలలో ప్రజలంతా జగన్ పరిపాలనకు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి శాసన మండలి రద్దు చేయటాన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు సర్వే రిపోర్ట్ లో తప్పు పట్టినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఒకే ఒక్క రాజధాని అమరావతి విషయంలో తప్ప మిగతా విషయాలు అన్నిటిలో జగన్ పర్ఫెక్ట్ పరిపాలన అందిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు వైసీపీలో వినబడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: