అమ్మాయిలపై క్షణాలలో అత్యాచారాలు జరుగుతాయి. క్షణాలలో వారిని హింసించి చంపుతారు.. రోజులు తరబడి హింసిస్తారు. కానీ ఆలా హింసించిన వారికీ శిక్ష వెయ్యం.. సంవత్సరాలు సంవత్సరాలు వారిని మేపుతాం.. వారిని జైల్లో ఉంచి హీరోలలా తయారు చేస్తాం.. వారికి నచ్చినట్టు శరీరాన్ని తయారు చేసుకునేలా చేస్తాం. 

 

కావాల్సిన ఆహారం పెడుతం.. శరీరానికి ప్రోటీన్ ఇస్తాం. అప్పుడప్పుడు కోర్టుకు తీసుకెళతాం. తీసుకొస్తాం.. అంతే తప్ప వారికీ శిక్షలు వేయించాం. ఇది మా నైజం.. ఛీఛీ.. 2012లో జరిగిన ఘటనకు ఇప్పటికి ఉరి శిక్ష వెయ్యలేదు.. ఇప్పటికి ఆ తల్లికి కన్నీరు పెట్టిస్తూనే ఉన్నారు.. ఏళ్ళ తరబడి భారత్ సహనాన్ని పరీక్షిస్తున్నారు ఈ నిరక్షలు... ఇంకో 12 గంటల్లో చస్తారు అనుకున్న సమయంలో ఉరి శిక్ష ఆగిపోయింది ఈ నీచులకు. 

 

ఇది ఇంకా ఎప్పుడు పడుతుందో తెలియదు.. మొన్న దిశ ఘటన జరగటం వల్ల ఆ నిర్భయ నిందితులు అంత ఉరి శిక్ష వరుకు వెళ్లారు కానీ లేకుంటే అది కూడా వెళ్లారు.. వాళ్ళను ఎవరు పట్టించుకుంటారు ? చెప్పండి ? ఇప్పుడు మరో దిశ ఘటన జరిగితే తప్ప వీరికి ఉరి శిక్ష పడదు అనే ఆలోచనలోకి వెళ్లిపోయాం.. 

 

ఇంకా ఇది అంత పక్కన పెడితే ఈ నిందితులకు తాజాగా ఉరి శిక్ష తేదిని ఖరారు చేసింది. మర్చి మూడో తేదీన ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష వేయనుంది. అయితే ఈ ఉరి శిక్ష మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వినయ్ శర్మ లాయర్ మరి పిటిషన్ వేశాడు.. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఈ నెల 16న తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నం వార్తలు వచ్చాయి. అయితే ఆ యత్నంలో పెద్దగా గాయాలు ఎం కాలేదు అని.. చికిత్స అందించినట్టు జైలు అధికారులు వెల్లడించారు. అయితే వినయ్ శర్మకు తీవ్రంగా గాయాలు అయినట్టు.. చెయ్యి విరిగినట్టు.. తలకు గాయం అవ్వటం వల్ల పిచ్చోడు అయినట్టు సినిమా స్టోరీని చెప్తున్నాడు వినయ్ శర్మ లాయర్. 

 

ఈ నేపథ్యంలోనే వినయ్ శర్మకు మానసిక వైద్య కేంద్రంలో మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ వేసినట్లు పేర్కొన్నారు. ఇది ఒక పిటిషన్ అయితే.. తన క్షమాభిక్ష పిటిషన్‌పై ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వినయ్‌శర్మ న్యాయవాది తెలిపారు.

 

జనవరి 29న క్షమాబిక్ష పిటిషన్ వెయ్యగా అతని వినతిని తిరస్కరించాలని జనవరి 30న ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది అని.. ఆ మంత్రి సంతకం చేసిన సమయానికి ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది అని అలాంటి సమయంలో సంతకం చేసే అధికారం వారికీ ఎలా ఉంటుంది? అని.. ఢిల్లీ తీసుకున్న నిర్ణయం అసలు చెల్లుతుందా? లేదా అనేది విచారించాలి అని ఆ లాయర్ తెలిపారు. ఇలా మరోసారి ఈ ఉరి శిక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: