రాజకీయాలలో పార్టీ వేరు ప్రభుత్వం మీరు అన్న విషయాన్ని చాలామంది స్వార్థపరులైన రాజకీయ నాయకులు తెలుసుకోలేకపోతున్నారు అన్న విషయం అక్షర సత్యం. ముఖ్యంగా మన ఆంధ్రరాష్ట్రంలో ప్రతీకారేచ్ఛతో జరిగే రాజకీయాలకు చాలా విశేషమైన చరిత్ర ఉంది. ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తలపెట్టిన సంక్షేమ పథకాలు మరొక పార్టీ ప్రభుత్వం లోకి రాగానే కొనసాగించకుండా నాన్చడం మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ విషయంలో మిగతా ముఖ్యమంత్రులు అందరితో పోలిస్తే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రం చాలా భిన్నం.

 

ఉదాహరణకు చూసుకుంటే చంద్రబాబు హయాం లో మొదలైన శంషాబాద్ ఎయిర్ పోర్టును మరియు పది కిలోమీటర్ల ఉన్న రింగ్ రోడ్డు 60 కిలోమీటర్ల వరకు పెంచడం ఇంకా హైటెక్ సిటీ, పిఆర్ ఫ్లైఓవర్ వంటి ఎన్నో నిర్మాణాలను రాజశేఖర్ రెడ్డి విజయవంతంగా కొనసాగించి పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య మరియు కెసిఆర్.... ఇలా ఎంతో మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన ఒక్క పథకాన్నీ కొనసాగించలేదు.

 

తెలంగాణ ప్రభుత్వం అయితే ఫీజు రియంబర్స్మెంట్ లను ఏకంగా ఎత్తివేసి ఏదో 10 వేల ర్యాంకు లోపల వచ్చిన వారికే ఇచ్చే లాగా పెట్టింది. మన ఆంధ్రాలో ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ స్వగృహ లాంటి ఎన్నో పథకాలు మరుగునపడిపోగా ఆరోగ్యశ్రీ కూడా అనేకానేక మార్పులకు చోటు చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజశేఖర్ రెడ్డి గతంలో ప్రవేశపెట్టిన పథకాలను మరియు జలయజ్ఞం కింద ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లాకు ఎంతో అవసరమైన సాగునీటి కోసం వెలుగొండ లో ప్రాజెక్టు ఆగస్టు కల్లా మొదటి విడత పూర్తవ్వాలని మరియు నివేదిక కూడా అందజేయాలని ఆజ్ఞాపించారు. దానితో పాటు అనేక ప్రాజెక్టులు ఎప్పుడో ఆగిపోయినవి అన్నీ ఆయన మళ్ళీ కొనసాగిస్తూ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: