మనం ఒకసారి కాలచక్రాన్ని వెనక్కి తిప్పినట్లయితే ఒక పది పదిహేనేళ్ళ ముందట ఇంజనీరింగ్ కాలేజీలో సీటు అంటే చాలా గొప్ప విషయంగా భావించేవారు. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఎక్కువ మరియు బోధించే కళాశాలలు తక్కువ ఉండటంతో ఎంసెట్ ర్యాంకుల కోసం విపరీతమైన పోటీ నెలకొనేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే జస్ట్ ఎంసెట్ క్వాలిఫై అయితే చాలు ర్యాంకు తో సంబంధం లేకుండా ఏదో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చేరేస్తున్నారు విద్యార్థులు.

 

ఇది ఒక మంచి పరిణామమే అయినా రాష్ట్రంలో దాదాపు 70 శాతం పైగా ఇంజనీరింగ్ కళాశాలలో కనీసం ప్రామాణికాలను పాటించకుండా ఉన్నాయి అన్నది వాస్తవం. ఇప్పుడు అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేవలం ఇంజనీరింగ్ కళాశాల యొక్క పనితీరు మరియు అర్హతను పరిశీలించేందుకు రెండు కమిటీలను నియమించనుండగా దీనితో రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలో వెన్నులో వణుకు మొదలైంది.

 

వీరంతా కనీస సదుపాయాలు లేకుండా మరియు లాబరేటరీలను నిర్వహించకుండా, ఉండాల్సిన ఎకరాలలో భవనాలను కట్టకుండా, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయకుండా మరియు తక్కువ అర్హత కలిగిన అధ్యాపకులను నియమించుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మరియు విద్యార్థుల దగ్గర అధికంగా వసూలు చేసే ఫీజులతో కళాశాలలను నడుపుతున్నారు. కొన్నిచోట్ల అయితే ఎం.టెక్ చదివిన విద్యార్థులు బీటెక్ వారికి పాఠాలు చెప్పడం మరియు ఇంకా సిగ్గుచేటుగా బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల చేత మొదటి సంవత్సరం వారికి పాఠాలు చెప్పించడం.... ఇక అటువంటి వారికి ఎనిమిది నుంచి 15 వేల జీతం ఇస్తే సరిపోతుంది కనుక కాలాన్ని ఇలా వెళ్లదీస్తున్నారు.

 

ఇప్పుడు జగన్ అలా కనీస సదుపాయాలు లేకుండా బయటపడబోయే అన్నీ ఇంజనీరింగ్ కళాశాలలకు చెక్ పెట్టే దిశగా మరియు ఏకంగా మూసివేసేటట్లు కమిటీని నియమించడం గమనార్హం. కావున రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య సగానికి సగం పడిపోనుండగా ఇంకా మంచి ప్రామాణికాలు మెరుగుపరుచుకుని లేదా అన్నీ సక్రమంగా ఉండే కొత్త ఇంజనీరింగ్ కళాశాలలకు పర్మిషన్ దొరకనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: