రాజకీయాల్లోకి కొత్త గా ఎంట్రీ ఇచ్చినా తనదైన స్టైల్లో దూసుకెళుతూ గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజిని కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పొలిటికల్ గా బాగా యాక్టివ్ గా ఉంటూ రాజకీయ ప్రత్యర్ధులకు ఆమె సింహస్వప్నంగా మారుతున్నారు. కొంతకాలంగా విడుదల రజిని పరిపాలన ఎక్కడా రాజీ పడకుండా దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ఆమెపై అదే స్థాయిలో వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులతోనూ ఆమెకు పొసగడంలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా రజినినే టార్గెట్ గా రాళ్లదాడి జరగడం ..ఆ సంఘటనలో ఆమె కారు  ధ్వంసం కావడం సంచలనం సృష్టిస్తోంది.


 కట్టుబడివారిపాలెం లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వార్త ఏపీ రాజకీయాలను మరోసారి వేడెక్కించే అవకాశం కనిపిస్తోంది. అసలు ఏమైంది అంటే...?  మహాశివరాత్రి ని పురస్కరించుకుని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని కుటుంబ సభ్యులు విడుదల వారి సుప్రసిద్ధ ను కోటప్పకొండ లో సమర్పించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పురుషోత్తమ పట్నం నుంచి వచ్చి కోటప్పకొండ లో సమర్పించి తిరిగి వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో కారు కు డ్యామేజ్ డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ దాడి జరిగిన సమయంలో రజని భర్త కుమార్, ఆమె మరిది గోపి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. 


ఈ సంఘటనలో గోపీకి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఎమ్యెల్యే రజని ఉన్నారనే భావించి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆమె లేకపోవడంతో దాడికి పాల్పడిన వారు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాలు కొట్టుకుపోవడంతో రెండు వర్గాల వారికి స్వల్పంగా గాయాలు అయినట్లు సమాచారం. అయితే కారుపై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ పరిణామాలు గుంటూరు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: