శాసనమండలి రద్దు కాకపోతే ఏమి చేయాలనే విషయంలో  ప్రత్యామ్నాయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు  చంద్రబాబునాయుడు మీడియా ఓ కథనాన్ని అచ్చేసింది.  ఒకవేళ మండలి రద్దు కాకపోతే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఛైర్మన్ ఎంఏ షరీష్ ను దింపేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లు చెప్పింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం కోసం వైసిపి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ ఓ స్టోరిని చక్కగా  అల్లేసింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  శాసనమండలి రద్దు కాదు అన్న ఆనుమానం కానీ లేకపోతే ఆలోచన కానీ వైసిపిలో లేదు. ఎందుకంటే శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన తర్వాత  ఆ తీర్మానాన్ని  పార్లమెంటు ఉభయ సభల్లో పెట్టటం తప్ప కేంద్రానికి వేరే మార్గం లేదు.  తీర్మానాన్ని ఆమోదించటం కేంద్రానికి ఇష్టం లేకపోతే  మహా అయితే ఆలస్యం చేయవచ్చంతే కానీ తిరస్కరించే అవకాశం లేదు.

 

ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించటానికే ఎక్కువ అవకాశం ఉంది. అదికూడా వీలైనంత తొందరలోనే జరిగిపోవచ్చు కూడా. ఎందుకంటే జగన్ తో నరేంద్రమోడికి చాలా అవసరం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.  రాజ్యసభలో మోడికి అవసరమైన బలం లేదు. లోక్ సభలో నెగ్గుతున్న ఏ బిల్లయినా రాజ్యసభలో నెగ్గించుకోవాలంటే బిజెపి నానా అవస్తలు పడుతోంది.

 

రేపు ఏప్రిల్ నెలలో ఏపి కోటాలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాలూ వైసిపికే దక్కబోతోంది. అంటే ఇపుడున్న రెండు సీట్లకు అదనంగా నాలుగు రాబోతోంది. అప్పుడు వైసిపి బలం ఆరుకు పెరుగుతుంది. వైసిపికి ఆరు రాజ్యసభ ఎంపిలుందంటే జగన్ తో మోడికి ఎంత అవసరముందో తెలిసిపోతోంది.  కాబట్టి తన డిమాండ్లను కేంద్రం ఆమోదిస్తుందన్న నమ్మకంతోనే జగన్ ఉన్నారు. పైగా మండలి రద్దు వల్ల బిజెపికి జరిగే నష్టం ఏమీలేదు. అదే సమయంలో చంద్రబాబునాయుడుకు పెద్ద నష్టం. కాబట్టి మండలి రద్దు అవ్వటానికే అవకాశాలు ఎక్కువున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: