రాజకీయాల్లో అవసరాలు, ఇబ్బందులు నాయకులని పార్టీలు మారేల చేస్తాయి. అయితే ఆ అవసరాలు వద్దనుకుని, ఇబ్బందులు తట్టుకుంటే ప్రజల అభిమానాన్ని ఎక్కువ పొందుతారు. లేదంటే ప్రజల చిత్తు చిత్తుగా ఓడిస్తారు. అలా గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవసరం కోసమో, ఇబ్బందులు వచ్చో పార్టీ మారిన వైసీపీ వాళ్ళ పరిస్తితి మొన్న ఎన్నికల్లో ఏమైందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక జంపిగులు టీడీపీలో మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చాలామంది టీడీపీని వీడిపోయారు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా గుడ్ బై చెప్పేశారు.

 

అయితే మరికొందరు మీద కూడా అధికార వైసీపీ మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేల మీద కూడా ఒత్తిడి తెస్తుందని, వారు పార్టీ మారిపోవచ్చని చాలరోజులు ప్రచారం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు టీడీపీని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

 

గొట్టిపాటికి చెందిన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్, గనుల శాఖ అధికారులు దాడులు చేయడంతో, ఆయన పార్టీ వీడతారని వార్తలు వచ్చేశాయి. అటు కరణం తన కుమారుడు భవిష్యత్ కోసం వైసీపీకి మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం వచ్చింది. అయితే వీరేవరు పార్టీ మారే ఛాన్స్ లేదని, వీరికి ఫ్యాన్ గాలి ఏ మాత్రం అవసరం లేదని తేలిపోయింది.  వీరు ఎలాంటి ఇబ్బందులు, అవసరాలు వచ్చిన పార్టీ వీడేది లేదని తెలుస్తోంది. టీడీపీలోనే ఉండి ఐదేళ్లు కష్టపడితే తర్వాత మంచి అవకాశాలే రావోచ్చని అనుకుంటున్నారు.

 

ఒకవేళ ఇప్పుడు అవసరం కోసం పార్టీ మారితే రేపు భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేం అనుకుంటున్నారు. పైగా తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడం, వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకిత భావన పెరుగుతుందనే నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు. మొత్తం మీదైతే ప్రకాశంలో ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపు తొంగే చూసే అవకాశమే లేదంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: