తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించాలని కొంత కాలంగా అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్న బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుడు నియమించే విషయంలో తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు. ఆయన సమర్ధవంతంగా పనిచేస్తున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన స్పీడ్  సరిపోదని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. అధిష్టానం ఊహించిన రేంజ్ లో ఆయన పార్టీని  ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పార్టీని ముందుకు నడిపించగల సమర్థుడైన నాయకుడి కోసం చాలా రోజులుగా బీజేపీ అధిష్టానం ఎదురుచూస్తోంది. 


ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడి రేసులో చాలామంది సీనియర్  నాయకులు పోటీ పడుతున్నారు. వారు తమకున్న పరిచయాలతో అధిష్టానం పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా బిజెపి మాత్రం తొందర పడకుండా సమర్ధుడైన నాయకుడి కోసం ఆరాతీస్తోంది. ప్రస్తుత తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి రేసులో కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్,  ధర్మపురి అరవింద్ పేర్లు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో ఈ ఇద్దరూ దూకుడుగా వెళుతున్నారు. యువ నాయకులు, కార్యకర్తల్లోనూ  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

అంతే కాకూండా టిఆర్ఎస్ దూకుడుకి అడుగడుగునా అడ్డు పడుతూ ఆ పార్టీని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్ . బండి సంజయ్ ఈ ఇద్దరిలో ఒకరిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పదవి కోసం పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం మాత్రం అరవింద్, సంజయ్ ఈ  ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.


 ప్రస్తుతం బీజేపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని టిఆర్ఎస్ కు ధీటుగా తయారు చేయాలని బిజెపి చూస్తోంది. బహుశా తెలంగాణలో అమిత్ షా భారీ బహిరంగ సభ వచ్చే నెల 15వ తేదీన నిర్వహించబోతున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కూడా అప్పుడే ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: