ఎంతగా పైకి స్నేహ హస్తం చాచినా.. ఇండియాకు చైనా పక్కలో బల్లెం లాంటిదే అని మరోసారి రుజువైంది. మన పొరుగుదేశం చైనా మరోసారి తన కుళ్లు బుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొనడంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

 

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన అమిత్ షా.. అరుణాచల్ ప్రదేశ్ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371ను రద్దు చేసే యోచన లేదని అక్కడ అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు

తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లోనూ అలా జరుగుతుందని కొందరు కావాలనే తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారని అమిత్ షా అన్నారు.

 

 

అయితే.. అమిత్ షా పర్యటన తమ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం అంటూ రంకెలు వేస్తోంది. అంతేనా.. ఇది పరస్పర రాజకీయ విశ్వాసానికి వెన్నుపోటు పొడవడం అంటూ ఘాటుగా కామెంట్ చేసింది. అంతే కాదు.. అసలు అరుణాచల్ ప్రదేశ్ ను తాము ఎప్పుడూ గుర్తించలేదని ఖరాఖండీగా చెప్పేసింది.

 

 

అరుణా చల్ ప్రదేశ్ లో అమిత్ షా పర్యటనను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. సరిహద్దు సమస్యను మరింత జటిలం చేసే చర్యలను ఆపాలని ఇండియాకు సూచించింది. సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు భారత్ చర్యలు తీసుకోవాలని మనకే నీతులు చెబుతోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ తమ ఆధీనంలోని టిబెట్ లో భాగం అని చైనా ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: