హైదరాబాద్ లో మోసగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. నగరంలో ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న యువతను, అక్రమ సంబంధాల ద్వారా కోరికలు తీర్చుకోవాలనుకుంటున్న మహిళలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. మహిళలకు, యువతకు మొదట కొంత నగదు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలని వారి దగ్గరనుండి డబ్బును లాగేసుకుంటున్నారు. యువతకు మహిళలను తృప్తి పరిస్తే లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పి వారిని ఆకర్షిస్తున్నారు. 
 
కొన్ని కారణాల వలన పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్న మహిళలకు మీ కోరికలు తీర్చుకోవడానికి మా దగ్గర అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. వెబ్ సైట్లు, డేటింగ్ సైట్ల ద్వారా మోసగాళ్లు ఈ తరహా మోసాలకు తెర లేపుతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడినవారు ఎవరికీ చెప్పుకోలేరని, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా భయపడతారని భావించి మోసగాళ్లు ఇలాంటి మోసాలతో యువతను, మహిళలను మోసం చేస్తున్నారు. 
 
తాజాగా ఇలా మోసం చేస్తున్న ఒక ముఠా గురించి హైదరాబాద్ నగరంలోని పోలీసులకు ఫిర్యాదు అందింది. మోసగాళ్లకు డబ్బులు చెల్లించి మోసపోయిన ఒక యువకుడు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ నగరంలో నయా దందా వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు కొన్ని వెబ్ సైట్ లలో కాల్ బాయ్ ఉద్యోగాలంటూ ప్రకటనలను ఉంచి ఎవరైనా ఫోన్ చేస్తే వారిని మాయమాటలతో నమ్మించి డబ్బులు అకౌంట్లో జమ చేయించుకుంటున్నారు. 
 
లక్షల్లో సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ తరువాత సెల్ ఫోన్ నంబర్లు స్విఛాఫ్ అని వస్తూ ఉండటంతో మోసపోయామని బాధితులు ఆలస్యంగా గ్రహిస్తున్నారు. చాలామంది మోసగాళ్ల బారిన పడి మోసపోయినా బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడకపోవడం మోసగాళ్లకు వరంగా మారింది. యువకుడి ఫిర్యాదుతో నగరంలో నయా దందా వెలుగులోకి వచ్చింది. సైబర్ పోలీసులు ఇలాంటి మోసపూరిత ప్రకటనల జోలికి వెళ్లవద్దని యువత, మహిళలకు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: