సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్న జేడీ లక్ష్మీనారాయణ ఆ తర్వాత తనకు ఉద్యోగానికి రాజీనామా చేసిజనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేనకు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీని విస్తరించాలని చూస్తున్న కేజ్రీవాల్పార్టీ ఏపీ అధ్యక్షుడిగా జేడీ లక్ష్మీనారాయణను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుండగానే తాజాగా ఈ రోజు ఓ సమావేశంలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ తన మనసులోని మాటలు మొత్తం బయట పెట్టారు.


 అసలు ఎన్నికల ముందు తాను జనసేన పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది అనే విషయం పై ఆయన స్పందించారు. జనసేన పార్టీలోకి నేను రావడానికి కారణం ఏంటి అంటే 'జీరో బడ్జెట్ పాలిటిక్స్ . జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని పవన్ కళ్యాణ్ నాతో అన్నారు అని జేడీ చెప్పారు. నేను ఆలోచిస్తున్న విధి విధానాలు మీలో ఉన్నాయి మీరు వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ జనసేన లోకి నన్ను ఆహ్వానించారు. పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిస్థితులు చాలా డిఫ్రెంట్ గా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి సమయం పడుతుంది. 16 , 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను. జనసేన నుంచి పోటీ చేసిన నాకు రెండు లక్షల 80 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. మేము ఎప్పుడూ ఓడిపోయాము అనుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా గెలుస్తామని భావించాం అంటూ లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని ఇచ్చారు.


 నన్ను పొలిటి బ్యూరో లో ఉండాలని కోరారు. ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేయడం సరికాదని ఆ సంఖ్య ఎక్కువ ఉండాలి అని చెప్పాను. ఆలోచనలు అనేవి అందులో జరగాలని అన్నాను. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుందని సూచించాను. అప్పుడే కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని చెప్పను. ఆ తర్వాత ఏమైందో తెలియదు.  నేను ఆ కమిటీలో లేను. నేను పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయం లేదు. ఎన్నికలు వచ్చాయి. సమావేశాల్లో పాల్గొన్నాను. నేనుఇవ్వాల్సిన సలహాలు ఇచ్చాను అని జేడీ చెప్పారు. ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పను అంటూ జనసేనలో తన అనుభవాలన్నిటిని జేడీ పంచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: