జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటో అర్ధంకాక  అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలకు ప్రభుత్వం పాలకమడళ్ళను నియమించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది మాసాలకు చాలా దేవాలయాలకు ప్రభుత్వం ఒకేసారి పాలకమండళ్ళను నియమించింది. మామూలుగా అధికార పార్టీ నియమించే పోస్టులంటే మొత్తం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండటం సహజం.

 

అయితే ఇక్కడే జగన్ ఆలోచనేంటో నేతలకు అర్ధంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ దేవస్ధానం పాలకమండలిలో బిజెపి నేత కూడా ఉండటంతో జిల్లాలోని నేతలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.  పాలకమండలిలో సభ్యులుగా ఉండటం కోసం ఒకవైపు నేతల నుండి జగన్ పై ఒత్తిడి వస్తున్న నేపధ్యంలోనే ఏకంగా బిజెపి నేతకు అవకాశం రావటంతో అదరూ షాక్ తిన్నారట.

 

విషయం ఏమిటంటే ప్రస్తుతం తెలుగుదేశంపార్టీలోని కీలక నేతల్లో ఒకరైన అశోక్ గజపతిరాజు సోదరుడు  ఆనంద గజపతిరాజు కూతురు సంచయితా గజపతిరాజుకు పాలకమండలిలో అవకాశం వచ్చింది. సంచయిత ఎవరంటే బిజెవైఎం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. అంతేకాకుండా బిజెపి తరపున మీడియాలో బలంతా తన వాదనను వినిపిస్తుంటుంది. అంటూ బిజెపికి చాలా స్ట్రాంగ్ సపోర్టరనే చెప్పాలి. ఇటువంటి సంచయితకు వైసిపి ప్రభుత్వం పిలిచి మరీ దేవస్ధానం పాలకమండలిలో సభ్యత్వం ఎలా ఇచ్చిందో నేతలు ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

 అయితే అందరికీ కనిపించే సంచయిత యాక్టివిటీస్ వెనుక సమాజం కోసం పరితపించే తపతన కూడా ఉంది. నరేంద్రమోడి అప్పుడెప్పుడో తెరమీదకు తెచ్చిన స్వచ్చభారత్ అమలు కోసం తన జిల్లా విజయనగరంలో చాలానే కష్టపడింది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా సంచయిత చొచ్చుకువెళ్ళి చాలా కార్యక్రమాలే నిర్వహించింది. అలాగే  అందరికీ మంచినీటి సరఫరా అందాలంటూ సంచయిత చాలా కార్యక్రమాలనే చేస్తోంది. అంటే ఏదో కార్యక్రమం పేరుతో రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటుంది. ఇటువంటి యాక్టివిటీస్ తోనే జగన్ ను ఆకట్టుకుందట. అందుకనే జగన్ తనంతట తానుగా సంచయితను  పాలకమండలిలో నియమించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: