ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్, ఊహించని విధంగా ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్ ఒకేసారి మంత్రి వర్గం ఏర్పాటు చేసేటప్పుడు, మంత్రి పదవులు రెండున్నరేళ్ళ వరకే ఉంటాయని, ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తానని ముందే చెప్పేశారు. కాకపోతే రెండున్నరేళ్లు మంచి పని తీరు కనబరిస్తే వాళ్ళని మాత్రం ఐదేళ్లు పాటు కొనసాగిస్తానని చెప్పారు.

 

ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే మంత్రులకు ఇంకా సంవత్సరం 9 నెలలు సమయం ఉంది. అయితే ఈ 9 నెలల్లో మంత్రులు పనితీరు చూసుకుంటే, జగన్ కొందరు మంత్రులని మాత్రం ఐదేళ్లు పాటు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది. అలా ఐదేళ్లు పాటు మంత్రి పదవిలో కొనసాగేవాళ్ళలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందుంటారు. వైసీపీ ప్రభుత్వంలో లెక్కల మాస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న బుగ్గన, ఖచ్చితంగా జగన్ కేబినెట్‌లో ఐదేళ్లు కొనసాగడం ఖాయం.

 

బుగ్గన తర్వాత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పకుండా ఐదేళ్లు ఉంటారని తెలుస్తోంది. జగన్‌తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కేబినెట్‌లో ఉండటం చాలా అవసరం. అటు మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఐదేళ్లు పాటు కొనసాగడం ఖాయం. అలాగే మరో సీనియర్ మంత్రి, జగన్‌ సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పకుండా ఐదేళ్లు పాటు ఉంటారు.

 

ఇక ఇటు తొలిసారి మంత్రులైన కొడాలి నాని, పేర్ని నానిలు కూడా ఈ 9 నెలల్లో మంచి పనితీరు కనబరిచారు. దీంతో వీరి బెర్త్‌లు రిజర్వేషన్ అయిదేళ్లపాటు కొనసాగనున్నాయి. అయితే మండలి రద్దు కావడం వల్ల సీనియర్ మంత్రులు పిల్లి సుబాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు త్వరలోని పదవులు పొనున్నాయి. వీరికి ప్రత్యామ్నాయ పదవులు ఇవ్వనున్నారు. అలాగే వ్యవసాయ మంత్రిగా ఉన్న కన్నబాబుకు ఐదేళ్ల పాటు కొనసాగే అవకాశాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: