అనంతపురం హిందూపురం తెలుగుదేశం కంచుకోట. 1983 నుంచి వేసుకుంటే మొన్న 2019 ఎన్నికల వరకు ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. పైగా ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలు ఇదే నియోజకవర్గం నుంచి అద్భుత విజయాలు సాధించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా బరిలో దిగిన నందమూరి బాలకృష్ణ అదిరిపోయే విజయం అందుకున్నారు.

 

ఇక 2019లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్న హిందూపురంలో మాత్రం బాలయ్యనే విక్టరీ కొట్టారు.  జగన్ అభ్యర్ధిని మార్చి బాలయ్యని దెబ్బకొట్టాలని ప్రయత్నించిన సాధ్యపడలేదు. బాలయ్య మీద పోటీ చేసిన ఇక్బాల్ 17 వేల పైనే మెజారిటీతో ఓడిపోయారు. అయితే అధికారం వైసీపీకి దక్కడంతో బాలయ్యకు ఏదొక విధంగా చెక్ పెట్టాలని జగన్ వ్యూహాలు వేస్తూనే ఉన్నారు. స్థానిక సమరంలో ఎలా అయిన టీడీపీని ఓడించాలని ప్లాన్ చేశారు.

 

ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 38 వార్డులు ఉన్న హిందూపురం మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో టీడీపీనే విజయం సాధించింది. అయితే ఎమ్మెల్యే గెలవలేకపోయిన, కనీసం ఇప్పుడు మున్సిపాలిటీని దక్కించుకుని బాలయ్యకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన ఇక్బాల్‌ నియోజకవర్గంలోనే పని చేసుకుంటున్నారు. కానీ బాలయ్య మాత్రం నియోజకవర్గం మొహం అసలు చూడటం లేదు. 

 

ఇప్పటికే మైనారిటీలను దగ్గరకు చేర్చుకునేందుకు ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవితో ఆయన దూసుకుపోతున్నారు. అయితే నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్లక్ష్యం చేస్తున్నారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నియోజకవర్గం కార్యకర్తలకు జగన్ సూచించారట. బాలయ్యపై వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే రాబోయే పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారట.

 

ఇటు జగన్ వ్యూహాలకు తగ్గట్టుగానే బాలయ్య నియోజకవర్గంలో అడ్రెస్ ఉండరు. పి‌ఏలనే పెట్టే నడిపిస్తారు. ఇలాంటి తరుణంలో హిందూపురం ప్రజలు అందుబాటులో ఉండే వైసీపీ వాళ్ళనే గెలిపించడానికి సిద్ధమయ్యారు. పైగా వైసీపీ అధికారంలో ఉండటం అడ్వాంటేజ్. మొత్తానికైతే హిందూపురంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: