సవాలక్ష జబ్బులకు హేతువైన పొట్టాను తగ్గించుకోవటానికి మీరు పద్దతులు ఉన్నాయి. ఒకటి వ్యాయామం ద్వారా పొట్ట తగ్గించుకునే ప్రయత్నం చేయడం రెండు ఆహార నియమాలను పాటించటం ద్వారా పొట్ట తగ్గించుకునే ప్రయత్నం చేయడం వ్యాయామం ద్వారా పొట్ట తగ్గించుకోవాలంటే దగ్గరలో ఏదైనా యోగా కేంద్రం ఉంటే అక్కడకు వెళ్లి వెల్లకిలా నేల మీద పడుకుని కాళ్లు ఉద్ధానపాదసనం ద్వారా ఒక కాలు పైకి లేపి కాసేపు ఉంచి కిందకు దింపాలి. తరువాత మరొక కాలు పైకి లేపి అదే విధంగా చేయాలి.

 

నెమ్మదిగా రెండు కాళ్లు పైకి లేపే ప్రయత్నం చేయాలి. అలా ఎంత సమయం ఉంచగలుగుతామో చెక్ చేసుకోవాలి. నేల నుండి కాళ్లను సుమారు 12 అంగుళాల ఎత్తుకు లేపాలి. ఆ తరువాత ఎక్కడ బాగా ఒత్తిడి వస్తుందో గమనించాలి. అలా ఉంచటం వలన పొట్టలో వైబ్రేషన్స్ వస్తూ అలా అలా కదిలిపోతూ ఉండటం కూడా గమనించవచ్చు. ఈ ఆసనం పొట్ట కరగటానికి మంచి ఆసనం అవుతుంది.

 

ఇది కాకుండా యోగాలో నౌకాసనం ఉంటుంది. ఈ ఆసనంలో రెండు చేతులని తొడల మీద ఉంచి చేతులు కాళు పైకి లేపి నడుము మీద నుండి బ్యాలన్స్ చేస్తూ ఉంచటం. ఈ ఆసనం చేస్తే పొట్ట కండరాలు చాలా శక్తిని విడుదల చేయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న నరాలు యాక్టివ్ కావడంతో పాటు పేగు కండరాలు బలపడతాయి. ఈ ఆసనం ద్వారా పొరలు పొరలుగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

 

పొట్ట కరగాలంటే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ పొట్ట ఉన్నవాళ్లు అల్పాహారాంగా పండ్లు తినటం మంచిది. బొప్పాయి, పుచ్చకాయ, జామ, కర్భూజ, కీరదోస, బత్తాయి, కమల ఇలాంటి పండ్లు తీసుకుంటే శరీరంలోకి కార్బోహైడ్రేట్లు తక్కువగా వెళతాయి. వీటిలో నీళ్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా మరియు రాత్రి భోజనంగా తీసుకుంటే మాత్రం పొట్ట తగ్గిపోవటం మొదలైనట్లే అని చెప్పవచ్చు.

 

రాత్రి ఆహారం ఆలస్యంగా తినేవారిలో పొట్ట ఎక్కువగా వస్తుంది. పొట్ట ఎక్కువగా ఉంటే గురక లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తగ్గాలంటే, భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఉండాలంటే జబ్బులు రాకుండా మనను మనం కాపాడుకోవచ్చు. రాత్రిపూట వీలైనంత త్వరగా పండ్లను ఆహారంగా తీసుకోవటం మంచిది. మరలా ఆకలిగా అనిపిస్తే రెండు మూడు గ్లాసుల మజ్జిగను ఆహరంగా తీసుకుంటే పొట్ట తగ్గించుకోవచ్చు. మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా శరీరానికి చాలా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: