22వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఇంకా ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి నేడు హిస్టరీ లోకి వెళ్లి చూసి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి : తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1847 ఫిబ్రవరి 22వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. తొలితరం స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన జీవిత చరిత్రపై  తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే సినిమా తీశారు. 


 జార్జి వాషింగ్టన్ జననం : మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడైన జార్జి వాషింగ్టన్ 1732 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్య మీద యుద్ధం లో అమెరికన్ సైన్యాన్ని విజయ పథంలో నడిపించినందుకు గాను ఆయనను ఈ పదవి వరించింది. కొన్ని సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగిన అయినా ఆ తర్వాత తొలగిపోయారు . 

 

 కొండా వెంకటప్పయ్య జననం: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు... దేశభక్త బిరుదాంకితుడు ఆయన కొండా వెంకటప్పయ్య 1866 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. ఈయన గాంధీజీ ఉప సేనలలో  తొలి జట్టుకు  చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి వెళ్లి పోరాటం చేశారు. 

 


 రావాడ సత్యనారాయణ జననం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రావాడ సత్యనారాయణ 1911 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. ఈయన  1969 -72 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా పని చేశారు. 


 పువ్వుల సూరిబాబు జననం : సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు అయిన పువ్వుల సూరిబాబు 1915 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం రంగస్థలం నటుడిగానే కాకుండా ఎన్నో సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఎన్నో పాటలను కూడా పాడారు పువ్వుల సూరిబాబు. 

 

చకిలం  శ్రీనివాస రావు జననం : కాంగ్రెస్ పార్టీ తరఫున నల్గొండ లోకసభ నియోజకవర్గం ఎంపీగా 9వ లోకసభ సభ్యులు గా పనిచేశారు చకిలం శ్రీనివాసరావు. 1922 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. 

 

 పుష్ప మిత్ర భార్గవ జననం  : భారతీయ ప్రముఖ శాస్త్రవేత్త సెంటర్ ఫర్ సొల్యూషన్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపకుడు అయినా పుష్ప మిత్ర భార్గవ  1928 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. 2017 సంవత్సరంలో పరమపదించారు. 

 

 తాతినేని చలపతిరావు జననం : ప్రముఖ సంగీత దర్శకులైన తాతినేని చలపతిరావు 1938 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. ఈయన ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసి ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు చిత్ర పరిశ్రమలో అందించారు. 

 

 కలువకొలను సదానంద జననం : ప్రముఖ బాలల సాహిత్య రచయిత బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి నుండి  మొట్టమొదటి బాల సాహిత్య పురస్కార అవార్డు అందుకున్న వ్యక్తి కలువకొలను సదానంద. ఈయన 1939 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. 

 

 తేజ జనం : ప్రముఖ సినీ దర్శకుడు నిర్మాత ఛాయా  గ్రాహకుడు మరియు రచయిత అయినా తేజ 1966 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. ఈయన రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాకు ఛాయాగ్రహకులుగా  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలకు కెమెరామెన్ గా  పని చేశారు తేజ. ఎన్నో సినిమాలకు కెమెరామాన్ గా పనిచేసిన తేజ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. 1000 అబద్దాలు సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. ఇక దర్శకుడిగా లక్ష్మీ కళ్యాణం అవునన్నా.కాదన్న,  నిజం,  జయం చిత్రం లాంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించి  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు తేజ. 

 

 మౌలానా అబుల్ కలాం ఆజాద్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత ప్రభుత్వం తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1958 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. 

 

 కోడి రామకృష్ణ మరణం : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఎన్నో సంచలనాత్మక సినిమాలను తెరకెక్కించారు  కోడి రామకృష్ణ.ఇంట్లో రామయ్య  వీధిలో కృష్ణయ్య అనే సినిమాతో కెరీర్ ప్రారంబించిన   నుంచి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ 2019 ఫిబ్రవరి 22వ తేదీన పరమపదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: