తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఇటీవల మీడియా ముందు చంద్రబాబు ఆస్తులను ప్రకటించడం జరిగింది. చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా లోకేష్ అదేవిధంగా కొడుకు నారా దేవాన్ష్ ఆస్తుల లెక్కలు గురించి అంతా లోకేష్ ప్రకటించారు. గత ఏడాది ఆస్తులు వాటిలో వచ్చిన పెరుగుదల మరియు తగ్గుదల అదేవిధంగా అప్పులు ఇంకా ఆస్తుల లో వచ్చిన మార్పులు అన్నిటి గురించి సవివరంగా తెలియజేశారు లోకేష్. నారా లోకేష్ ప్రకటించిన ఆస్తుల పై భిన్న స్వరాలు రాష్ట్రంలో వినబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఇది ప్రచారం చేసుకోవడానికి చాలా బాగుంది..సొంత పార్టీ నాయకులు తమలో ఉన్న నిజాయతీని చాటుకున్నాం అని తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు.

 

చంద్రబాబు నిజాయితీపరుడు కాబట్టే ఈ విధంగా బహిరంగంగా ఆస్తుల గురించి ప్రకటించుకుంటూ ఉన్నామని టిడిపి నాయకులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ ఆస్తులను సీబీఐ ప్రకటిస్తే చంద్రబాబు ఆస్తులను స్వయంగా కుటుంబ సభ్యులు ప్రకటిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ గట్టిగా సోషల్ మీడియాలో వెటకారం అయినా కామెంట్ చేస్తూ వస్తోంది. ఇదంతా పక్కన పెడితే నారా లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు విమర్శకులకు ప్లాట్ ఫామ్ గా మారింది.

 

కావాలని టీడీపీ పులిహోర కలుపుతుందని, మరి ఎన్నికలలో ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కూడా అదే అంటుంది. మరి వందల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారని, పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సందర్భంలో లెక్కలు ప్రకటించిన సమయంలో కొన్ని కీలక విషయాలను నారా లోకేష్ చెప్పకుండా మర్చిపోయినట్లు దీంతో చంద్రబాబు తలపట్టుకున్నట్లు టిడిపి పార్టీలో టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: