ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత సంచ‌ల‌నానికి దారితీసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యా లు అన్నీ ఒక ఎత్త‌యితే.. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రింత దుమ్మురేపుతోంది. టీడీపీ అధినేత‌ చంద్ర బాబు పాల‌నా హ‌యాంలో ఏపీలో జ‌రిగిన కార్య‌క్ర‌మాలు, బాబు తీసుకున్న నిర్ణ‌యాలు, ఆయ‌న వేసిన అడుగులు, కార్పొ రేష‌న్ల ఏర్పాటు, నిదుల వినియోగం, కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు ఇలా అనేక అంశాల‌ను మ‌రీ ముఖ్యంగా ఐదేళ్ల‌లో ఆయ‌న తీసుకు న్న ప్ర‌తి నిర్ణ‌యాన్నీ జ‌ల్లెడ ప‌ట్టేలా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం భారీ క‌ల‌క‌లం సృష్టించింది.

 

చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన నిర్ణ‌యాల్లో జ‌రిగిన లోపాలు, దారి మ‌ళ్లిన నిధులు, నిధుల దుర్వినియోగం, అయిన‌వారికి అందిన అంద‌లాలు వంటి వాటిపై ద‌ర్యాప్తు జ‌రిపేలా జ‌గ‌న్ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించారు. ఈ సిట్ ఏర్పాటుకు సంబందించి జీవో 344ను తాజాగా జారీ చేశారు. గ‌త ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌పై ఈ సిట్ అధికారులు మ‌రింత లోతుగా విచారించి ప్ర‌భుత్వానికి నివేదిక‌లు స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ సిట్ అంతా కూడా పోలీసు ఉన్న‌తాధికారుల‌తో కూడి ఉండడం మ‌రింత ఆస‌క్తి క‌లిగిస్తోంది. 

 

అయితే, జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంలో పూర్తిగా రాజ‌కీయ కోణ‌మే క‌నిపిస్తోంద‌న్న‌ది టీడీపీ నేత‌ల మాట‌. చంద్ర‌బాబు ను టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అప్పుడే త‌మ్ముళ్లుఎదురు దాడి ప్రారంభించారు. గ‌తంలో వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న 26 క‌మిటీల‌ను వేసి విచార‌ణ‌లు జ‌రిపార‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు ఇప్పుడు ఈ సిట్ ఏర్పాటును లైట్ తీసుకుంటారో సీరియ‌స్‌గా భావిస్తారో చూడాలి. అయితే, ఇప్పుడున్న రాష్ట్ర రాజ‌కీయాల్లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత‌గా ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్‌ను పెంచుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 


అయితే, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ విష‌యాన్ని వ్యూహాత్మ‌కంగా తీసుకుని చంద్ర‌బాబు అనుక్ష‌ణం డిఫెన్స్‌లో ప‌డేయాల‌నే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం, కోర్టుల్లో కేసులు వేసేలా ప్రొత్స‌హించ‌డం, జ‌గ‌న్‌పై బుర‌ద జ‌ల్లే ప‌నులు చేయ‌డంతోనే చంద్ర‌బాబు స‌రిపెడుతున్నార‌ని, ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను డిఫెన్స్‌లో ప‌డేయ‌డం ద్వారా ప్ర‌భుత్వంపై జ‌రుగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని కొంత వ‌ర‌కైనా త‌గ్గించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని వారు అంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ జీవో కార‌ణంగా జ‌గ‌న్ వ‌ర్సెస్ బాబుల మ‌ధ్య దూరం మ‌రింత‌గా పెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: