చంద్రబాబునాయుడు ఐదేళ్ళ పరిపాలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకమొత్తంగా సిట్ విచారణకు ఆదేశించింది. చంద్రబాబు హయాంలో అవినీతి ఆకాశమేహద్దుగా చెలరేగిపోయిందని జగన్ భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే ఇటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పీస్ పీస్ గా విచారణ ప్రారంభించారు. ఇందులో భాగమే ఇన్ సైడర్ ట్రేడింగ్. సరే ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో సిఐడి దర్యాప్తు ముగించి ప్రస్తుతం ఐటికి ట్రాన్స్ ఫర్ చేసిందనుకోండి అది వేరే సంగతి.

 

ప్రతి అంశాన్ని ఇలా విడివిడిగా దర్యాప్తులు, విచారణలు చేయించేకన్నా హోల్ సేల్ గా ఒకేసారి విచారణ చేయిస్తే మేలని జగన్ అనుకున్నట్లున్నారు. అందుకనే చంద్రబాబు ఐదేళ్ళ పరిపాలనలో జరిగిన అక్రమాలపై ఒకేసారి సిట్ విచారణకు ఆదేశిస్తు ఉత్తర్వులు జారీ చేసేశారు. సిట్ నేతృత్వాన్ని డిఐజి అధికారి కొల్లి రఘురామ్ రెడ్డికి అప్పగించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే 10 మంది సిట్ బృందంలో మొత్తం పోలీసు అధికారులే ఉండటం.

 

చంద్రబాబు పాలనలోని అవకతవకలపై గతంలోనే ఓ సిట్ ను నియమించింది. అది ఇన్ సైడర్ ట్రేడింగ్, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి తదితరాలపై దేనికి దాన్నే విచారణ జరిపించారు. కానీ ప్రస్తుతం వేసిన సిట్ కు చాలా అధికారాలే కట్టబెట్టారు. ఈ బృందం ఏ శాఖకు సంబంధించిన సమాచారాన్నైనా తెప్పించుకోవచ్చు. ఎటువంటి అధికారినైనా తమ ముందుకు పిలిపించుకోవచ్చు.

 

ప్రతిశాఖ సిట్ విచారణకు సహకరించాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. పైగా సిట్ ను మొబైల్ పోలీసు స్టేషన్ గా గుర్తించినట్లు కూడా చెప్పింది. చంద్రబాబు టార్గెట్ గానే సిట్ నియమించిన విషయం తెలిసిపోతోంది. నిజానికి చంద్రబాబు హయాంలో అవినీతి కూడా విచ్చలవిడిగా జరిగిందన్నదీ వాస్తవమే. దానికి తగ్గట్లే ఇపుడు జగన్ సర్కార్ ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకుంది. మరి సిట్ ఎటువంటి విచారణ జరుపుతుంది ? ఏ విషయాన్ని బయటపెడుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: