వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ తీస్తున్న ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. వాస్త‌వా నికి జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాల‌ను విప‌క్షాలు రాద్ధాంతం చేస్తాయి. కానీ ఇప్పుడు రివ‌ర్స్‌లో ఈ కేసు న‌డుస్తోం ది.  త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేయ‌నున్నారు. ఈక్ర‌మంలో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలో కి వ‌చ్చేందుకు అనేక మంది నాయ‌కులు కృషి చేశారు. దీంతో స్తానిక ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చూపించేందుకు, స్థానికంగా ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. దీంతో స్థానిక ఎన్నిక‌ల కోసం వారంతా ఎదురు చూశార‌నే చెప్పాలి.


అయితే, అనూహ్యంగా జ‌గ‌న్ ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో విధించిన నిబంధ‌న‌లు అం ద‌రినీ విస్తుగొలుపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా గెలిచినా.. తప్పు నిరూపణ అయి శిక్ష పడితే పదవిని వదులుకోక తప్పదు. ఈ మేర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నిబంధ‌న‌లు ప్ర‌తిప‌క్షాల‌కు కొరుకుడుప‌డ‌డం మాట అటుంచి.. సొంత పార్టీ నాయ‌కుల‌కే ఇబ్బందిగా మారింది.

 

గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వ్యక్తులు గెలిచి జైలులో ఉన్నా పదవుల్లో ఉండేవారు. తాజా సవరణల ప్రకారం.. క్రిమినల్‌ కేసులున్న వ్యక్తులు ఎన్నికైతే పదవి నుంచి తొలగిస్తారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు మూడేళ్లు వరకు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఈ నిబంధ‌న‌లు మంచివే అయినా.. ఇప్పుడు రాజ‌కీయాల్లో ఉన్న‌వారిలో నూటికి 80 మంది నేరాలు, కేసుల‌తోనూ సంబంధాలు ఉన్నాయ‌నేది వాస్త‌వం. గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌స‌మ‌యంలో అప్ప‌టి అధికార ప‌క్షం ఉద్దేశ పూర్వ‌కంగా కేసులు న‌మోదు చేసిన సంద‌ర్భాలు కూడా ఉండి ఉంటాయి.

 

వీటిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే త‌మ‌కు అన్యాయం జ‌ర‌గ‌దా? ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకునే ముందు పార్టీలో చ‌ర్చ జ‌రిపి ఉంటే బాగుండేద‌ని రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ‌స్తున్నాయి ప్ర‌స్తుతానికి మౌనంగానే ఉన్న‌ప్ప‌టికీ.. త్వ‌ర‌లోనే దీనిపై జ‌గ‌న్ను క‌ల‌వాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు భావిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే ఇది చ‌ట్టంగా మార‌డం గ‌మ‌న‌ర్హం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో.. చూడాలి. ఉద్దేశం మంచిదే అయినా అమ‌లులో సాధ్యం అయ్యేది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: