తనకు మావోయిస్టుల నుండి ప్రాణభయం ఉంది కాబట్టి తనకు భద్రత పునరుద్ధరించమంటూ మాజీ మంత్రి మొత్తుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాజీమంత్రులు, మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు నేతలకు భద్రతను కుదించటమో లేకపోతే మొత్తంగా ఉపసంహరించటమో చేసింది.   ఈ విషయమై చంద్రబాబునాయుడు దగ్గర నుండి క్రిందస్ధాయి నేతల వరకూ జగన్ ప్రభుత్వంపై నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే.

 

సరే ఎవరి యాగీ ఎలాగున్నా మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ మాత్రం ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఈ కుర్రాడు అసలు మంత్రయ్యిందే కారుణ్య నియామకం కోటాలో. అంటే తన తండ్రి, ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్పి చంపేసిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో వైసిపి తరపున అరకు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత టిడిపిలోకి ఫిరాయించాడు సర్వేశ్వరరావు. తర్వాత జరిగిన పరిణామాల్లో మావోయిస్టులు ఫిరాయింపు ఎంఎల్ఏని కాల్చి చంపేశారు.

 

తండ్రి మావోయిస్టుల కాల్పుల్లో చనిపోవటంతో కొడుకు శ్రవణ్ కుమార్ కు చంద్రబాబునాయుడు మంత్రిని చేశాడు. అప్పటి నుండి మంత్రికి గట్టి భద్రతనే కల్పించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటి చేసిన శ్రవణ్ కుమార్ చాలా ఘోరంగా ఓడిపోయాడు. అయినా మాజీ మంత్రి అనే ట్యాగ్ తో భారీ భద్రత మధ్యే తిరుగుతున్నారు. అయితే ఈమధ్యనే జగన్ ప్రభత్వం సెక్యురిటి రివ్యూ చేసి చాలామందికి భద్రతను తీసేసింది. వీరిలో శ్రవణ్ కూడా ఉన్నాడు.

 

ఇంకేముంది వెంటనే జిల్లా ఎస్పీని కలిశాడు. తాను నివసముండేదే మావోయిస్టుల ప్రాబల్యమున్న అరకు నియోజకవర్గమని చెప్పుకున్నాడు. భద్రత లేనిదే తాను ఇంట్లో నుండి కాలు కూడా బయటపెట్టలేనని మొత్తుకున్నాడు. కాబట్టి ఉపసంహరించిన భద్రతను మళ్ళీ పునరుద్ధరించాలంటూ ఎస్పీని కోరాడు. మరి ఎస్పీ ఏమి చేస్తాడనే విషయం సస్పెన్స్ గా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: