ఊహించని ట్విస్ట్ లు ఇస్తూ అందరిని అయోమయానికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనూ కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇదే తరహా వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ,సొంత పార్టీ నాయకులను కూడా క్రమశిక్షణ లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకు వచ్చి ప్రజాప్రతినిధులందరూ భయపడేలా చేస్తున్నారు. ఇప్పటి నుంచే కెసిఆర్ వారికి వార్నింగ్ లు ఇస్తూ ఒక దారిలోకి వచ్చేలా చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ ఇప్పటి నుంచే పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 


ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు .. సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ దీనికోసం ఇప్పటికే అనేక చట్టాల్లో మార్పులు తీసుకు వచ్చారు. కానీ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎమ్మెల్యేల్లో నెలకొన్న నిర్లక్ష్యంతో  ఆశించిన స్థాయిలో వాటి అమలు అంత సులభం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి వారి పనితీరును మెరుగు పరచాలని కెసిఆర్ చూస్తున్నారు. దీనికోసం త్వరలోనే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే దానిపై ప్రోగ్రెస్ కార్డులు ద్వారా తెలియజేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా టిఆర్ఎస్ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.


 ఈ పోగ్రెస్ కార్డుల ద్వారా ఎవరు పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది వారికి తెలిసే విధంగా చేయాలని, దీని ద్వారా వారి పనితీరును మెరుగు పరుచుకునే లో చేయాలని కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే కఠినంగా ఉండాలి అని చూస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఇలా ఎవరు విషయంలోనూ రాజీ పడేందుకు ఇష్టపడడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాలో ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: