క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  అసందర్భంగా నారా లోకేష్ చేసిన ఆస్తులు, అప్పుల చిట్టా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  ఇపుడు ఆ ప్రకటనే ఇటు చంద్రబాబునాయుడు, అటు మావగారు కమ్ మేమమామ అయిన నందమూరి బాలకృష్ణను ఇరికించేసినట్లు అర్ధమవుతోంది. తన కొడుకు దేవాన్ష్ పేరుతో చూపించిన 26,400 షేర్లే  ఈ మొత్తం కంపుకు ప్రధాన కారణమవుతున్నట్లు సమాచారం.

 

మొన్న లోకేష్ మాట్లాడుతూ తన కుటుంబంలో ఎవరెవరి పేర్లతో ఆస్తులు, అప్పుల చిట్టాను ప్రకటించారు. మొత్తం ఐదుగురు కుంటుంబంలో దేవాన్ష్ పేరుతో వేలాది షేర్లు ఎలా వచ్చాయన్నదే అసలు సమస్యగా మారింది. ఇదే విషయాన్ని జగన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. లోకేష్ చెప్పినట్లుగా చంద్రబాబే మొత్తం షేర్లను దేవాన్ష్ పేరుతో బదిలి చేసినట్లు చెప్పడం విచిత్రంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు పేరుతో షేర్లున్నట్లు లోకేష్ ఎప్పుడూ ప్రకటించలేదు.

 

అయితే  చంద్రబాబు పేరుతో ఉన్న షేర్లను మనవడి పేరుతో బదిలీ చేసినట్లు టిడిపి మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. దీనికితోడు సాక్షి మీడియా కూడా లేని షేర్లను ఎలా బదిలీ చేస్తారని  నిలదీసింది. దాంతో వెంటనే లోకేష్  నాలిక కరుచుకుని  తన తండ్రి నుండి కొడుక్కి షేర్లు బదిలీ కాలేదని తన మామగారు బాలకృష్ణ బదిలీ చేసినట్లు మీడియాతో రాయించుకున్నారు.

 

ఇక్కడే రెండో  సమస్య మొదలైంది. అదేమిటంటే మనవడికి బాలయ్య బదిలీ చేసిన షేర్లను ఎక్కడి నుండి తెచ్చారనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల అఫిడవిట్ లో బాలయ్య తన పేరు మీద హెరిటేజ్ షేర్లున్నట్లు చెప్పలేదు. మరలాంటపుడు తన పేరు మీద లేని షేర్లను బాలకృష్ణ మాత్రం ఎక్కడి నుండి తెచ్చిచ్చినట్లు ?   అంటే చంద్రబాబు బదిలీ చేసినట్లు మొదటిసారి ప్రకటించి తప్పు చేసిన లోకేష్  రెండోసారి బాలకృష్ణ బదిలీ చేసినట్లు చెప్పి రెండోతప్పు చేశారు. దాంతో ఇపుడు ఇద్దరూ తగులుకున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: