ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. దిశ చట్టం, రివర్స్ టెండరింగ్ మరియు అమ్మ ఒడి ఇంకా అదే విధంగా రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలతో చట్టాలతో చాలా మందిని దేశంలో ఉన్న బడా బడా రాజకీయ నేతలను ఏపీ వైపు చూసేలా జగన్ పరిపాలిస్తున్నారు అని ఇప్పటికే చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఒకచోట మాత్రమే కేంద్రీకృతం అవ్వకూడదు అని మూడు రాజధానుల నిర్ణయం జగన్ తీసుకోవడం జరిగింది. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అదే విధంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఇంకా జనసేన పార్టీ నాయకులు కూడా తీవ్రంగా విభేదించడం జరిగింది.

 

అంతేకాకుండా ఈ విషయంపై కొంతమంది హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఇటువంటి తరుణంలో జగన్ తీసుకున్న 3 రాజధానుల మాదిరిగానే కర్ణాటక రాష్ట్రంలో బిజెపి సర్కారు కూడా మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో కొన్ని కార్యాలయాలు బెంగళూరులో కి రావడంతో జగన్ తీసుకున్న 3 రాజధానుల దెబ్బకి కర్ణాటకలో మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగళూరు వాసులు ఇది జగన్ ఫార్ములా అంటూ బెంగళూరు నగరంలో కి వచ్చిన ప్రభుత్వ కార్యాలయాలను ఉద్దేశించి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్దేశించి సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

 

ఇదే సమయంలో బెంగళూరులో ఉన్న కొన్ని కీలక కార్యాలయాలను కూడా ఉత్తర కర్ణాటకలోని బెళగావికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఉత్తర కర్ణాటకకు ఉపయోగపడే అనేక కార్యాలయాలను అక్కడికి మారుస్తున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి బెంగళూరుకు రావాలి అంటే దూరం కాబట్టి కొన్నింటిని అక్కడికి మార్చిడం వలన పరిపాలన సుగమం అవుతుందని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో తాజాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సర్కార్ అమలు చేసిన తరుణంలో ఆ ప్రాంతంలో మంచి రెస్పాన్స్ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: